Tuesday, February 18Thank you for visiting

Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

Spread the love

Telangana: రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన రైతు రుణమాఫీ ప‌థ‌కాన్ని(Raitu RunaMafi) ) కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు ప్రారంభించింది. మొదటి విడతలో రూ. లక్ష వ‌ర‌కు ఉన్న రుణాలు మాఫీ చేసి చూపింది. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగస్టు 15 నాటికి మొత్తం రెండు లక్షల రూపాయ‌ల వ‌ర‌కు గ‌ల‌ రుణాల‌ను రైతుల తరఫున ప్రభుత్వం (Congress Government) బ్యాంకుల్లో జ‌మ చేసేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధుల‌ను విడుదల చేశారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేయ‌డంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఒకేసారి రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయ‌క‌పోవ‌డంపై బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం మండిప‌డింది.

రేపే రెండో విడుత రుణ మాఫీ

Second Phase Raitu RunaMafi : కాగా, ఇప్పటికే రూ.లక్ష వ‌ర‌కు ఉన్న‌ రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్.. రెండో విడత రుణమాఫీకి అంతా సిద్ధం చేసింది. జూలై 30న మంగళవారం రెండో విడత రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. లక్షన్నరలోపు ఆరు లక్షల మంది రైతులకు రుణాలను మాఫీ చేయడానికి సంక‌ల్పించారు. ఇందుకోసం ప్రభుత్వనికి సుమారు 7,000 వేల కోట్లు అవసరం ఉంది. గతంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం సుమారు 12 లక్షల మందికి రూ.6,000 కోట్లు పంపిణీ చేసింది.

READ MORE  Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?