Home » Third Phase Voting : ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో నిలిచిన అగ్ర నేతల జాబితా..
Third Phase Voting

Third Phase Voting : ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో నిలిచిన అగ్ర నేతల జాబితా..

Spread the love

LOK SABHA ELECTION 2024 : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా మూడో ద‌శ పోలింగ్ (Third Phase Voting ) మంగ‌ళ‌వారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఈ దశలో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లు, గోవాలోని 2 సీట్లు, దాద్రాలోని 2 సీట్లు, నగర్ హవేలీ & డామన్ – డయ్యూ, అస్సాంలో 4 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 4 సీట్లు, బీహార్‌లో 5 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 7 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 9 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 10 సీట్లు, మహారాష్ట్రలో 11 సీట్లు, కర్ణాటకలో 14 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

కాగా మూడో దశ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, ఎన్సీపీ-శరద్ చంద్ర పవార్, సుప్రియా సూలే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ సహా పలువురు ప్రముఖ నేతలు బరిలో నిలిచారు.

READ MORE  Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

నియోజకవర్గాల జాబితా:

అస్సాం: ధుబ్రి, కోక్రాఝర్, బార్పేట, గౌహతి
ఛత్తీస్‌గఢ్: సర్గుజా, రాయ్‌ఘర్, జంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్‌పూర్, దుర్గ్, రాయ్‌పూర్
బీహార్: ఝంజర్‌పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా
పశ్చిమ బెంగాల్: మల్దహా ఉత్తర్, మల్దహా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్
గోవా: ఉత్తర గోవా, దక్షిణ గోవా

గుజరాత్: కచ్ఛ్, బనస్కాంత, పటాన్, మహేసన, సబర్‌కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్ ఈస్ట్, అహ్మదాబాద్ వెస్ట్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, పోర్‌బందర్, జామ్‌నగర్, జునాగఢ్, అమ్రేలి, భావ్‌నగర్, ఆనంద్, ఖేడా, పంచమహల్, దాహోద్, వడోదర, ఛోటా ఉదయపూర్, భరూచ్, బరుచ్, , సూరత్, నవసారి, వల్సాద్.

READ MORE  Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

ఉత్తరప్రదేశ్: సంభాల్, హత్రాస్, ఆగ్రా (SC), ఫతేపూర్ సిక్రి, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, బుదౌన్, అయోన్లా, బరేలీ

కర్ణాటక: చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా

మధ్యప్రదేశ్: భింద్, భోపాల్, గుణ, గ్వాలియర్, మోరెనా, రాజ్‌గఢ్, సాగర్, విదిషా, బేతుల్

మహారాష్ట్ర: బారామతి, రాయ్‌గఢ్, ఉస్మానాబాద్, లాతూర్ (SC), షోలాపూర్ (SC), మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కనాంగ్లే

కేంద్ర‌పాలిత ప్రాంతం : దాద్రా -నగర్ హవేలీ, డామన్ – డయ్యూ

READ MORE  నస్రల్లా మరణంతో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసిన మెహబూబా ముఫ్తీ

2024 లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగగా, రెండో విడత ఏప్రిల్ 26న పూర్త‌యింది. మూడో దశ పోలింగ్ (Third Phase Voting ) మే 7న (మంగళవారం) జరగనుంది. మొత్తం ఏడు దశల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..