Friday, August 29Thank you for visiting

Local

Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

Coach Restaurant | వరంగల్ రైల్వే స్టేషన్ లో త్వరలో కోచ్ రెస్టారెంట్..

Local
Coach Restaurant | భోజన ప్రియులకు సంతోషకరమైన వార్త! భారతీయ రైల్వేలు అత్యాధునిక రీతిలో రూపొందించిన‌ రైల్ కోచ్ రెస్టారెంట్..  రైలు ప్రయాణీకులు, సామాన్య ప్రజలకు ఎంతో దగ్గరయ్యాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ కోచ్ రెస్టారెంట్లు ప్రజాదరణ పొందాయి. తాజాగా వ‌రంగ‌ల్ రైల్వే స్టేషన్‌లో త్వ‌ర‌లో ఈ చక్రాలపై రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.వరంగల్ రైల్వే స్టేషన్లో త్వరలో ''కోచ్ రెస్టారెంట్' ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఏడీఆర్ఎం(ఐ) గోపాల్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఇటీవ‌ల‌ పరిశీలించారు. IOW కార్యాలయం ఎదుట త్వరలో ఏర్పాటు చేయనున్న కోచ్ రెస్టారెంట్ స్థలాన్ని, అలాగే మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ పనులను కూడా ఆయ‌న పరిశీలించారు. ఈ కోచ్ రెస్టారెంట్ ఏంటి? Rail Coach R...
Warangal | సమస్యలను వెలికితీయడమే కాదు.. పరిష్కార మార్గాలను కూడా సూచించండి..

Warangal | సమస్యలను వెలికితీయడమే కాదు.. పరిష్కార మార్గాలను కూడా సూచించండి..

Local
జ‌ర్న‌లిస్టుల‌కు పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా చేస్తా.. పోలీస్‌క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిషోర్ ఝాWarangal:  వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల‌కు పోలీస్ శాఖ నుంచి ఇబ్బందులు త‌లెత్త‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ (Warangal CP) అంబ‌ర్ కిషోర్ ఝా అన్నారు. జ‌ర్న‌లిస్టులు  స‌మ‌స్య‌ల‌ను వెలికితీయ‌డంతోపాటు, ప‌రిష్కార మార్గాల‌ను కూడా సూచించాలని కోరారు.   హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్‌, మైసూర్ వంటి న‌గ‌రాల‌తో స‌మానంగా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌రం అభివృద్ధి చెందాలంటే జ‌ర్న‌లిస్టులు కీల‌క పాత్ర పోషించాల‌ని అన్నారు. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ స‌భ్యుల‌కు ఐడీ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడు వేముల నాగ‌రాజు అధ్య‌క్ష‌త‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బొల్లార‌పు స‌ద‌య్య‌, కోశాధికారి బోళ్ల అమ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్రెస్ క్ల‌బ్ మీటింగ్ హాల్‌లో బుధ‌వారం జ‌రిగింది. ముఖ్య అతిథిగా సీపీ అంబ‌ర్...
బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

Local
warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు జరగయి.. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి (Bala Tripura Sundari Devi) గా దర్శనమిచ్చారు.అర్చకులు కళ్యాణ్ మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛరణలతో హోమ, కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.సాయంత్రం చిన్నారి విశ్వాని పొడిశెట్టి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులందరు.. అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.. వరంగల్ కీర్తినగర్ లోని శ్రీ నిమిషాంబ దేవీ ఆలయంలో కనుల పండువగా శరన్నవరాత్రి వేడుకలు.. బాలత్రిపుర సుందరి దేవీ అలంకరణ...
15 నుంచి నిమిషాంబా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

15 నుంచి నిమిషాంబా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Local
warangal:  వరంగల్ జిల్లా కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) సిద్ధమైంది. గత నెల వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు కుంకుమ పూజలు, వ్రతాలు, హోమాలతో సందడి నెలకొనగా తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 24 వరకు దేవీ శరన్నరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.నవరాత్రి ఉత్సవాలను (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించనున్నట్లు  ఆలయకమిటీ ప్రకటించింది. మొదటిరోజు అక్టోబర్  15 ఆదివారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ నుంచి 24న విజయదశమి రోజు వరకు నిమిషాంబ దేవి అమ్మవారు ఒక్కొ రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. విజయ...
సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

Local, Telangana
కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యంWarangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ కళాశాల యాజమాన్యానికి అందజేశా రు. వరంగల్ తూర్పులోని సీకేఎం కళాశాలను ప్రభుత్వప రం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా సీకేఎం కళాశాలను ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేసిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆచార్య చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనం ­తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అంతిమంగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ...
నిమిషాంబదేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం

నిమిషాంబదేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం

Local
Warangal:  వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం సాయంత్రం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని(satyanarayana swamy vratham) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీలో కొలువుదీరిన నిమిషాంబదేవి ఆలయంలో వేదపండితులు కల్యాణ్ సమక్షంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలపించిన భక్తిగీతాలు అందరనీ అలరిచాయి. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.కాగా నిమిషాంబదేవి ఆలయంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కల్యాణ్ తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. అభయాంజనేయస్వామి ఆలయంలో నేడు మహాన్నదానం కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 22న శుక్రవారం మధ్యాహ్నం మహాన్నదానం నిర్వహించనున్నట్...
మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

Crime, Local
Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగపెట్టి ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొమురాజుల రాములుతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదీ జరిగింది. మంచిర్యాల(mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో మేకలను చోరీ చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో కట్టి వేలాడదీశారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగ...
బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..

బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..

Local
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ Warangal : బహిరంగంగా తల్వార్(కత్తి)ను తిప్పుతూ ప్రదర్శనలు ఇచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలం లో వరంగల్ కమిషనరేట్ పరిధి (warangal police commissionerate) లో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై ఎవరైనా వ్యక్తులు పుట్టిన రోజుల వేడుకల్లో గానీ ఇతర కార్యక్రమాల సమయాల్లో గానీ తల్వార్లను బహిరంగంగా ఎత్తిచూపడం, వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా పోస్టులు చేయొద్దని హెచ్చరించారు. అలాగే తల్వార్లు పట...
పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Crime, Local
Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర...
ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

Local
Warangal : ఆటోలో మర్చిపోయిన సూమారు రూ.12 లక్షల విలువ గల 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు.ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు వివరాలను వెల్లడించారు. శనివారం రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందగట్ల జోత్స్న వరంగల్ చౌరస్తా బట్టలతో పాటు తన ఇంటిలోని బంగారు ఆభరణాలకు మెరుగు పెట్టించుకొని ఆటోలో కాశిబుగ్గ చౌరస్తాలోదిగి ఇంటికి వెళ్లింది. కాగా బంగారు ఆభరణాల బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు మహిళ వెంటనే కాశిబుగ్గ చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎర్ర రవికి సమాచారం ఇచ్చింది. ఆయన తక్షణమే అప్రమత్తమైన హోంగార్డు తన మ్యాన్ ప్యాక్ ద్వారా ఇన్ స్పెక్టర్ వెంకన్నతో పాటు, మిగతా ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ ల...