Home » Lava Blaze Curve 5G | త్వ‌రలో మేడిన్ ఇండియా.. లావా నుంచి బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..
Lava Blaze Curve 5G

Lava Blaze Curve 5G | త్వ‌రలో మేడిన్ ఇండియా.. లావా నుంచి బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..

Spread the love

 

Lava Blaze Curve 5G స్మార్ట్ ఫోన్‌.. త్వరలో భారతదేశంలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్.. ఫోన్‌కు ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు, కానీ లాంచ్ కు ముందే దాని ముఖ్య లక్షణాలు, ధర వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. Lava Blaze Curve 5G, MediaTek Dimensity 7050 SoCలో ప‌నిచేస్తుంద‌ని తెలిసింది. ఇది 8GB RAM, 256GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను క‌లిగి ఉంటుంది. లావా బ్లేజ్ 2 5G గత సంవత్సరం నవంబర్‌లో సేల్ అయింది. ఇది బ్లేజ్ సిరీస్‌లో తక్కువ ధ‌ర‌లోనే వ‌చ్చింది.

READ MORE  Samsung Crystal 4k TV | తక్కువ ధరలోనే హైటెక్ ఫీచర్లతో శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు వచ్చేశాయి.. వీటి ధరలు

ధర ఎంత ఉండొచ్చు..?

Tipster Paras Guglani (@passionategeekz) X లో లావా బ్లేజ్ కర్వ్ 5G ధర భార‌త్ లో రూ. 16,000 నుంచి రూ. 19,000. మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఇది రెండు కలర్ ఆప్షన్లలో వస్తుందని చెబుతున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 7050 SoC ద్వారా ప‌నిచేస్తుంది. ఈ చిప్‌సెట్ AnTuTu వెబ్‌సైట్‌లో 5,50,000 కంటే ఎక్కువ స్కోర్‌ను కలిగి ఉందని పేర్కొని ఉంది. Lava Blaze Curve 5G 8GB RAM + 128GB అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

లావా బ్లేజ్ కర్వ్ 5G లాంచ్ వివరాలను లావా ఇంకా వెల్లడించలేదు. గత లీక్‌ల ప్రకారం , హ్యాండ్‌సెట్ మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తార‌ని స‌మాచారం. ఇది 120Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 64-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరాను క‌లిగి ఉంటుంది. లావా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సునీల్ రైనా ఇటీవల ఖచ్చితమైన పేరును ధృవీకరించకుండా కొత్త స్మార్ట్‌ఫోన్ రాక గురించి టీజ్ చేశారు..

READ MORE  BSNL News : మాన్‌సూన్ డబుల్ బొనాంజా.. నెలకు రూ. 399కి ఫైబర్ బేసిక్ ప్లాన్‌ తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్

Lava Blaze 2 5G స్పెసిఫికేన్స్..

లావా Blaze 2 5G అనేది Lava కంపెనీ నుంచి వ‌చ్చిన Blaze సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త మోడ‌ల్‌. హ్యాండ్‌సెట్ గతేడాది నవంబర్‌లో రూ. బేస్ 4GB RAM + 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం 9,999 ధ‌ర‌లో విడుద‌లైంది.. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల 2.5D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 6020 SoCతో ప‌నిచేస్తుంది. 6GB వరకు RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో నడుస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో వ‌స్తుంది.

READ MORE  Gas Cylinder : రూ.500ల‌కు గ్యాస్ సిలిండర్.. మొద‌ట‌ పూర్తి ధర చెల్లించాల్సిందేనా..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..