Thursday, April 17Welcome to Vandebhaarath

Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. కొత్తగా ఏఐ సిటీ నిర్మాణం..

Spread the love

Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు త్వరలో మహర్దశ రానుంది. AI పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడానికి, ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి కంపెనీలను ఆహ్వానించడానికి హైదరాబాద్ శివార్లలో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నగరాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ నగరం ఇప్పటికే దేశంలోనే టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హబ్‌గా పేరు గాంచింది. ఇప్పుడు  దీనిని భారతదేశానికి AI రాజధానిగా అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల వెల్లడించారు.

మహేశ్వరం, చేవెళ్ల..

hyderabad ai city location : ఏఐ నగరం కోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 200 ఎకరాల స్థలాన్ని నగర ఏర్పాటుకు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, అవి అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా డిసెంబర్ 2023లో లక్నోలో AI నగరాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.  కానీ అది ఇంకా గ్రౌండింగ్ కాలేదు. ఇది కేవలం 40 ఎకరాల భూమిని మాత్రమే కేటాయించింది. ఇది 2030లో పూర్తవుతుందని అంచనా. కానీ హైదరాబాద్‌లోని ప్రతిపాదిత AI నగరం లక్నోలో ఉన్నదాని కంటే ఐదు రెట్లు పెద్దది. 2028 నాటికి పూర్తి కానుంది.

READ MORE  Malkajgiri : శరవేగంగా మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు

తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరులో ఏఐ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అంతకు ముందు సెప్టెంబర్ 5,  6 తేదీలలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్లోబల్ AI సమ్మిట్‌ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సమ్మిట్ తో ప్రపంచ AI నిపుణులు, సాంకేతిక నిపుణులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు కీలక ప్రసంగాలు, ఆలోచనలను రేకెత్తించే సెషన్‌లు ఉంటాయి. 50 మందికి పైగా వక్తలు, వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 2,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

READ MORE  Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

మంత్రి శ్రీధర్ బాబుతోపాటు  ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఆగస్టు 3-11 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అగ్రశ్రేణి గ్లోబల్ ఐటి ప్రతినిధులను కలిసి AI నగరం (Hyderabad Ai City )లో వారి పెట్టుబడుల కోసం వారిని ఆహ్వానించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రతిపాదిత ఏఐ సిటీలో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, చట్ట అమలు, మొబిలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరమయ్యే అన్ని రంగాల కంపెనీలు ఉండబోతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

READ MORE  Registration Charges | నవంబర్‌లో రిజిస్ట్రేషన్ పెంచనున్న ప్రభుత్వం?

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *