
Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. కొత్తగా ఏఐ సిటీ నిర్మాణం..
Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు త్వరలో మహర్దశ రానుంది. AI పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడానికి, ప్రోత్సహించడానికి అగ్రశ్రేణి కంపెనీలను ఆహ్వానించడానికి హైదరాబాద్ శివార్లలో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నగరాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ నగరం ఇప్పటికే దేశంలోనే టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హబ్‌గా పేరు గాంచింది. ఇప్పుడు దీనిని భారతదేశానికి AI రాజధానిగా అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల వెల్లడించారు.
మహేశ్వరం, చేవెళ్ల..
hyderabad ai city location : ఏఐ నగరం కోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 200 ఎకరాల స్థలాన్ని నగర ఏర్పాట...