Friday, February 14Thank you for visiting

LPG Price Hike : కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు.. నగరాల వారీగా కొత్త ధరలు ఇవే..

Spread the love

 

LPG Price Hike: ఆగ‌స్టు నెల ప్రారంభంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 8.50 పెంచాయి, ఆగస్టు 1, 2024 నుంచి ఈ కొత్త ధ‌ర‌లు అమలులోకి వస్తాయి. అయితే, 14 కిలోల దేశీయ గ్యాస్ ధర సిలిండర్ మార‌లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ ప్రకారం, న్యూఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1652.50గా ఉంది. ఇది రూ. 1646 నుంచి రూ. 6.50 పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.8.50 పెరిగి రూ.1764.50కి చేరింది. ముంబైలో కొత్త ధర రూ.1605, చెన్నైలో రూ.1817గా ఉంది. కాగా, జూలై 1, 2024న 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్‌ల ధర రూ. 30 తగ్గించిన విష‌యం తెలిసిందే..

READ MORE  First Bullet Train | భారత్ లో మొద‌టి బులెట్ రైలుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

LPG Price Hike : కొత్త నగరాల వారీగా కొత్త ధరలు

నగరం కొత్త ధర (రూ.లలో)          పాత ధర (రూ.లలో)

  • ఢిల్లీ 1652.50                          1646
  • ముంబై 1605                         1,598
  • కోల్‌కతా 1764.50                    1,756
  • చెన్నై 1817                            1,809.5
READ MORE  ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్

ఎల్‌పీజీ డొమెస్టిక్ సిలిండర్ ధరలో మార్పులు లేవు

Domestic LPG Cylinder Price : సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర మారలేదు. దిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది. ముఖ్యంగా, జూన్ 1, 2023న, ఢిల్లీలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధర రూ.1103. ఆగస్ట్ 30, 2023న చమురు కంపెనీలు రూ.200 మేర భారీగా తగ్గించడంతో ధరలు రూ.903కి చేరాయి. తదనంతరం, మార్చి 9న , 2024, మరో రూ.100 తగ్గించాయి.

READ MORE  New Criminal Justice | కొత్త క్రిమినల్ చట్టాలతో దేశం పురోగమిస్తుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..