
Lok Sabha Elections 2024 Voter Slip : దేశంలో సాధారణ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగియగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) 88 స్థానాలకు రెండవ దశలో ఏప్రిల్ 26, శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారి ఓటరు ID కార్డులతో పాటు వారి ఓటరు స్లిప్పులను వెంట ఉంచుకోవాలి.
ఓటర్ స్లిప్ (Voter Slip) అంటే ఏమిటి?
ఓటర్ స్లిప్ అనేది తన ఓటు వేసేందుకు అర్హతను నిర్ధారిస్తుంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఉన్నట్లు చెప్పడానికి ఒక రకమైన రుజువు. ఓటర్ స్లిప్‌లో ఓటరు పేరు, చిరునామా, ప్రాంతం, బూత్ సమాచారంతోపాటు ఇతర వివరాలతో సహా సమాచారం ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి ముందు వారి నియమించబడిన పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారికి స్లిప్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
పోలింగ్ అధికారి ఓటరు స్లిప్‌లో పేర్కొన్న సమాచారాన్ని ఎలక్టోరల్ రోల్ మార్క్ కాపీతో ధ్రువీకరిస్తారు. ఓటర్ల గుర్తింపుకు కూడా బాధ్యత వహిస్తారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలో ఎవరైనా తన గుర్తింపు పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రజలు తమ ఓటర్ స్లిప్‌ను పోలింగ్ అధికారికి చూపించాల్సి ఉంటుంది, దీనిని అనధికారిక గుర్తింపు స్లిప్ అని కూడా అంటారు. ఓటరు స్లిప్ ను మీ నివాసం వద్ద లేదా పోలింగ్ బూత్‌లో పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియలో మీ పేరును గుర్తించడం, పోలింగ్ బూత్‌ను కనుగొనడంలో స్లిప్ సహాయపడుతుంది.
ఓటరు స్లిప్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్ బై స్టెప్స్..
- భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ https://voters.eci.gov.in/ ని సందర్శించండి
- పేజీ లోకుడి వైపున E-PIC డౌన్‌లోడ్ విభాగం కోసం చూడండి
- మీరు లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీరు రిజిస్ట్రేషన్ ను కోసం కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది.
- సైట్‌లో నమోదు చేసుకోవడానికి మీ వివరాలను పూరించండి
- రిజిస్ట్రేషన్ తర్వాత, మీరు లాగిన్ అవ్వాలి
- తర్వాత, EPIC నంబర్ (ఓటర్ ID కార్డ్ నంబర్) నమోదు చేయండి
- సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.. మీరు అదే పేజీలో మీ పేరు కనిపిస్తుంది.
- ధ్రువీకరణ కోసం మీరు పేర్కొన్న మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- OTPని ఎంటర్ చేసిన తర్వాత, మీరు ఓటర్ స్లిప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..