Lok Sabha elections 2024: లోక్ సభ ఎన్నికల సందర్బంగా ప్రముఖ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ రాపిడో ( Rapido VOTENOW offer ) సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. కంపెనీ ప్రవేశపెట్టిన “సవారీజిమ్మెదరికీ” కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత బైక్ టాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్‌లను అందిస్తామని ప్రకటించింది. బెంగుళూరు, మైసూరు, మంగళూరులోని ఓటర్లు ఏప్రిల్ 26న ‘VOTENOW’ కోడ్‌ని ఉపయోగించి ఓటింగ్ పాయింట్‌లకు వెళ్లడానికి, తిరిగి వెళ్లడానికి ఉచిత రైడ్‌లను పొందవచ్చని రాపిడో తెలిపింది.
Rapido VOTENOW offer : 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ECI), బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) సహకారంతో బెంగుళూరులోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచిత ఆటో, క్యాబ్ రైడ్‌లను అందించడం ద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రాపిడో ఒక ప్రకటనలో తెలిపారు.
వికలాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కులను వినియోగించుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్టు రాపిడో సహ వ్యవస్థాపకులు పవన్ గుంటుపల్లి తెలిపారు.
ఓటు వేసి ఉచితంగా దోశలు తినండి..
బెంగళూరులో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, అనేక రెస్టారెంట్లు వాణిజ్య సంస్థలు ముందుకు వస్తున్నాయి.. ఓటువేసిన తర్వాత తమ సిరా వేళ్లను చూపించిన కస్టమర్‌లకు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌లు, డిస్కౌంట్‌లను అందించాలని నిర్ణయించుకున్నాయి. కర్నాటకలో శుక్రవారం (ఏప్రిల్ 26) పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా బెంగళూరులో తక్కువ ఓటింగ్ శాతంపై ఆందోళనలు నెలకొన్నాయి.
బెంగళూరు నృపతుంగ రోడ్‌లోని నిసర్గ గ్రాండ్ హోటల్ వారు ఓటు వేసినట్లు రుజువుగా తమ సిరా వేళ్లను చూపించిన ఓటర్లకు ఏప్రిల్ 26న ఉచితంగా దోసె, నేతి లడ్డూ, జ్యూస్‌ను అందజేస్తామని చెప్పారు.
మాల్గుడి మైలారి మానే (ఉచిత మైలారీ దోస, ఫిల్టర్ కాఫీ), కేఫ్ ఉడిపి రుచి (ఉచిత మాక్‌టైల్), అయ్యంగార్స్ ఓవెన్ ఫ్రెష్ బేకరీ (10 శాతం తగ్గింపు), ఓరియన్ మాల్‌లోని కామత్ హోసరుచి, లులు మాల్‌లో పోలింగ్ రోజున ఓటర్లకు కాంప్లిమెంటరీ ఐటమ్స్ అందించనున్నాయి.
మెట్రో రైలు సర్వీసుల పొడిగింపు
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) కూడా ఎన్నికల సందర్భంగా తన సేవలను పొడిగించాలని నిర్ణయించింది. నాగసంద్ర, సిల్క్ ఇనిస్టిట్యూట్, చల్లఘట్ట, వైట్‌ఫీల్డ్ (కడుగోడి) టర్మినల్స్ నుంచి చివరి రైలు రాత్రి 11:55 వరకు నడుస్తుంది. నాడప్రభు కెంపేగౌడ స్టేషన్ మెజెస్టిక్ నుండి నాలుగు వైపు చివరి రైలు ఏప్రిల్ 27వ తేదీ అర్ధరాత్రి 12:35 గంటలకు బయలుదేరుతుందని అధికారులు
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..