DSC Recruitment 2024 | తెలంగాణలో సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం కసరత్తు కూడా మొదటుపెట్టింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరు వరకు తుది కీ విడుదల చేయనునుంది. మరోవైపు జిల్లాల వారీగా వివిధ కేటగిరీ పోస్టుల విభజన, డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు, రోస్టర్ విధానంపై విశ్లేషిస్తున్నారు. పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన కారణంగా ఫలితాలను వేగంగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 మంది పరీక్ష రాశారు. త్వరలో ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. మరుసటి రోజు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
రోస్టర్ విధానం, జిల్లాల వారీగా పోస్టుల డేటాను వివరాలను రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే కసరత్తు చేయనుంది. ప్రతీ జిల్లాలోనూ ఒక టీచర్ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ విధానంలో ఎంపిక చేసి, ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించింది. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాలకు సంబంధించిన విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే లిస్ట్ పంపాలని భావిస్తున్నారు.
DSC Recruitment 2024 ప్రక్రియను సెప్టెంబర్ మూడవ వారంలో ముగించి, జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగో వారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఒక వేళ ఇది ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ మొదలుపెట్టవచ్చని సమాచారం. ఏదేమైనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..