Dharani : తెలంగాణలో ధరణి పోర్టల్ లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యలపై సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ సర్క్యులర్ జారీ చేశారు.ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ బుధవారం వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సీసీఎల్‌ఏ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ఈ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ స్థాయిలో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు బుక్స్, నాలా కన్‌వర్షన్, పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణలు ఉన్నట్లు తెలిపారు. అందులో పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్చేటపుడు కచ్చితంగా ఈ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు.
ధరణి (Dharani )పెండింగ్ దరఖాస్తులను ఎలా పరిశీలిస్తారు..?
తహసీల్దార్ దరఖాస్తులను పరిశీలించి ఆర్డీవోకు పంపించాల్సి ఉంటుంది. అలాగే తహసీల్దార్ దగ్గరి నుంచి వొచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన తర్వాత దానిని అదనపు కలెక్టర్‌కు ఆర్డీవో అప్‌లోడ్ చేయాలని సూచించారు. తహసీల్దార్, ఆర్డీవోల పరిశీలన తర్వాత తనకు వచ్చిన ధరఖాస్తులను సంపూర్ణంగా పరిశీలించి ఆమోదం తెలపడం గానీ, రిజెక్ట్ చేయడం గానీ చేయాలని స్పష్టం చేశారు. అయితే దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఏ కారణం చేత రిజెక్ట్ చేస్తున్నారో స్పష్టం చేయాలని సూచించారు. ఆర్డీవో స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలకు సంబంధించిన పెండింగ్ నాలా, డిజిటల్ సైన్ తదితర వాటిని పరిష్కారం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆ సర్క్యులర్‌లో అధికారులకు పేర్కొన్నారు.
అప్లికేషన్ల పరిష్కారానికి గడువు
హోదా | గడువు |
తహశీల్దార్ | 7 రోజులు |
ఆర్డీవో | 3 రోజులు |
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) | 3 రోజులు |
కలెక్టర్ | 7 రోజులు |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..