Coach Factory In Kazipet | ఉమ్మడి వరంగల్ వాసులు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారం కాబోతోంది. ఇక్కడ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విభజన హామీలలో మరో హమీని కేంద్రం ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్(ఆర్ ఎం యు) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని కేంద్ర రైల్వేశాఖ అప్ గ్రేడ్ చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) జీఎంకు రైల్వే బోర్డు లెటర్ రాసింది.
55 సంవత్సరాలుగా వరంగల్ వాసులు, ఉద్యోగులు కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నారు. 2014లో ఏపీ విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం కూడా హమీ ఇచ్చింది. 2023లో వ్యాగన్ తయారీ పరిశ్రమపై ఒక ప్రకటన చేసింది.. కానీ అమల్లోకి రాలేదు. మరోవైపు దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా చేయాలని పలువురు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలపడంతో పాటు బొగ్గు రవాణాలో కీలకంగా ఉన్న కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం కలగనుందని స్థానికులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..