Sunday, September 14Thank you for visiting

Crime

#crime #truecrime #thriller #murder #drama #mystery #police #film #movie #criminal #news #truecrimecommunity #action #movies #horror #cinema #serialkiller #justice #bookstagram #o #s #love #podcast #truecrimeaddict #serialkillers #truecrimepodcast #law #comedy #covid #books

Sandeshkhali |  సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..

Sandeshkhali | సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..

Crime, National
Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచ‌రుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. కాగా సీబీఐ అధికారుల,  ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం సందేశ్‌ఖాలీకి చేరుకున్న విషయం తెలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో ఐదు బృందాలు దాడులు నిర్వహించాయని ఏజెన్సీ అధికారులు తెలిపారు. కొంద‌రు అనుమానితుల వ‌ద్ద‌ భారీగ...
ఢిల్లీ మద్యం కేసు: కవితకు  మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం కేసు: కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Crime
Dlehi Liquor Scam Updates | ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తోపాటు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. AAPకి కిక్‌బ్యాక్‌లకు బదులుగా దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినందుకు నిందితులు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నారని ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఆరోపించింది. దిల్లీ లిక్క‌ర్ విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని కూడా రూస్ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది. ముగ్గురు నిందితులను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజూ 15 నిమిషాలపాటు తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన ఒక రోజు తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైన వైద్య చికిత్స అందించాలని ఢిల్...
Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర‌ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద‌ ఎన్ కౌంట‌ర్‌.. 29 మంది నక్సల్స్‌ మృతి

Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర‌ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద‌ ఎన్ కౌంట‌ర్‌.. 29 మంది నక్సల్స్‌ మృతి

Crime
Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతిచెందార‌ని అనధికారిక వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదేనని పోలీసులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో తొలిద‌శ‌ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమ‌వుతున్న క్ర‌మంలోనే ఇంత‌టి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే బస్తర్‌ రీజియన్‌లో వ‌రుస ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారు.ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృ...
Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్‌ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం    

Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్‌ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం    

Crime, National
Demolition Drive : ఉత్తరప్రదేశ్‌కు చెందిన లిక్కర్ డాన్ పాంటీ చద్దా (Ponty Chadda)కు చెందిన కోట్లాది విలువైన ఫామ్‌హౌజ్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు కూల్చివేశారు, ఢిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో లిక్కర్‌ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి ఫామ్‌హౌస్‌ ఉంది. ఆ ఫామ్ హౌస్‌ విలువ సుమారు రూ.400 కోట్ల కంటే పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.పాంటీ చద్దా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ ఫామ్‌హౌజ్‌ను నిర్మించినట్లు అధికారులు తేల్చారు. దీంతో శుక్ర, శనివారాల్లో బుల్ డోజ‌ర్ తో వ‌చ్చి ఫామ్‌హౌస్‌ ను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌజ్‌ పాంటీ చద్దా కుమారుడు మన్‌ప్రీత్‌ అలియాస్‌ మాంటీ చద్దా ఆక్ర‌మ‌ణ‌లో ఉంది. ఈ ఫామ్‌హౌస్ లోనే గతంలో పాంటీ చద్దా, అతడి చిన్న తమ్ముడు హర్దీప్ గ‌ర్ష‌ణ‌ప‌డి ప్రాణాలు పోగొట్టుకున్నారు.వీరి మ‌ధ్య‌ గొడవ తీవ్ర‌మై హర్దీప్‌ తన అన్న అయిన‌ పాంటీ చద్దాను తుపాకీతో కాల్చి...
Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు – దోషులకు క్షమాభిక్ష రద్దు

Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు – దోషులకు క్షమాభిక్ష రద్దు

Crime
Supreme Court Quashes Gujarat Decision on Bilkis Bano Case : దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన గుజరాత్ (Gujarat)కు చెందిన బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుల్లో దోషులైన 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టంచేసింది. 11 మంది నిందితులను రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలంటూ ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ మహారాష్ట్ర లో జరిగినందు వల్ల .. దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని త...
Rare Judgement | రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌.. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు

Rare Judgement | రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌.. రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు

Crime
రేప్ కేసులో 60 ఏళ్లు జైలు శిక్ష‌ రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పుసూర్యాపేట: మదమెక్కిన కామాంధుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి ఏకంగా 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2012లో చోటుచేసుకున్న ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలన తీర్పు (Rare Judgement) ఇచ్చింది. ఈ తీర్పుపై మహిళా, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వివరాలలోకి వెళితే.. సూర్యాపేట జిల్లాకు చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉపాధి కోసం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణ పరిధిలోని ఆర్జాలబావి ప్రాంతంలో నివాసముంటూ కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సెంట్రింగ్‌ పనిచేసే చిట్యాలకు చెందిన నిజాముద్దీన్‌ అలియాస్‌ నిజ్జు వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉన్నాడు. మైనర్ బాలికకు చాక్లెట్లు కొనిస్తూ, మొబైల్ ఫోన్‌ చూపిస్తూ అసభ్యంగా ప్ర...
Delhi | బిర్యానీకి డబ్బు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు పొడిచి చంపిన 16 ఏండ్ల కుర్రాడు

Delhi | బిర్యానీకి డబ్బు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు పొడిచి చంపిన 16 ఏండ్ల కుర్రాడు

Crime
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బిర్యానీకి (Biryani) డబ్బులు ఇవ్వలేదని 17 ఏళ్ల యువకుడిని ఓ కుర్రాడు కత్తితో పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతడిపై డ్యాన్స్‌ చేశాడు. బాధితుడైన 17ఏళ్ల యువకుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్‌ (Jafrabad) ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి జనతా మజ్దూర్‌ కాలనీ మీదుగా (Janta Mazdoor Colony) కాలి నడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో 16 సంవత్సరాల కుర్రాడు అతడిని అడ్డగించాడు. బిర్యానీ తినేందుకురూ.350 కావాలని ఆ యువకుడిని అడిగాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పగా ఆవేశానికిలోనైన ఆ కుర్రాడు అతడిని కొట్టాడు. దీంతో కింద పడిపోయిన బాధితుడిపై నిందితుడు కూర్చుని మెడ, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచి...
Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్‌

Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్‌

Crime
లక్నో: సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల నుంచి సేకరించిన అండాలు విక్రయిస్తున్నారు. (Minor Girls Eggs Selling) నిరుపేద కుటుంబాలలోని బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్‌ సెంటర్లకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు విక్రయిస్తున్నట్లు 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బుతో అమ్మాయిలను ఎరగా వేసి వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది.. మరోవైపు బాలిక అండాల కోసం రూ.30,000 ఇస్తామని చెప్పి 11,500 రూపాయలు మాత్రమే చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది.కాగా, వారణాసి పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. వారణాసి నవపుర ప్రాంతానికి చెందిన సీమా దేవి, ఆమె...
పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు

పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు

Crime
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో అక్టోబర్ 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులకు బుధవారం జిల్లా కోర్టు వారి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో నిందితుల చేతులపై ఉన్న టాటూ(Tattoos)లు కీలకంగామారి వారిని పట్టించాయి.ముర్షిదాబాద్‌లోని లాల్‌బాగ్ సబ్-డివిజనల్ కోర్టులో దోషులు బాసుదేబ్ మొండల్, మిథున్ దాస్, ఆకాష్ మొండల్ తోపాటు అరుణ్ మోండల్‌లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దీప్తా ఘోష్ తీర్పు వెలువరించారు. . లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పురుషులు దోషులుగా తేల్చారు. కాగా ఈ కేసు విచారణ 120 రోజుల్లో ముగిసింది." గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్...
Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!

Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!

Crime
హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఘటన..! Hanumakonda | కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనైన ఓ కానిస్టేబుల్‌ అత్తను రివాల్వర్ తో కాల్చి చంపాడు. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా, నిందితుడిని ప్రసాద్ గా గుర్తించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రసాద్‌ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రసాద్‌ భార్యతో కలిసి ఇటీవల  Hanumakonda గుండ్ల సింగారం గ్రామానికి వచ్చాడు. డబ్బుల విషయంలో మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్‌ గన్ తో కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ పై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తలక...