Hydra Updates | ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాకు ఎదురు లేదు..

Hydra Updates | ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాకు ఎదురు లేదు..

Hydra Updates |  హైదరాబాద్ నిరంతరం పరిశుభ్రమైన నగరంగా ఉండాలని అందుకే హైడ్రాను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పర్యావరణ పునరుజ్జీవనం జరగాలనే  ఉద్దేశంతోనే. హైడ్రాను ఏర్పాటు చేశామని,  ఒకప్పుడు లేక్‌ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌.. ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి గత పదేళ్ళ పాలకులే కారణమని విమర్శించారు. అక్రమ నిర్మాణాల ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవంలో  ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

READ MORE  PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.  ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం ఎంతో మందిని బలిగొంది. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు ఎప్పుడు కూడా రావొద్దు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం, స్వార్థం లేదు. ఇదొక పవిత్ర కార్యం…. ప్రకృతిని కాపాడుకునే మహా యజ్ఞం. దీనికి అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలి. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారటీ ఇస్తుంది. ఇది నా భరోసా…. ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

READ MORE  Lok Sabha election 2024 results : జూన్ 4న ECI వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *