Posted in

Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు

Cherlapally Railway Terminal
Spread the love

Cherlapally Railway Terminal |  ప్రయాణికులకు శుభవార్త.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో  కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం ఉంది. అయితే  రైల్వే టర్మినల్  అందుబాటులోకి వచ్చాక సుమారు 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను రూపొందంచింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని ట్రైన్స్ ను చర్లపల్లి టెర్మినల్కు మార్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఆరు లైన్లతో అత్యాధునిక స్టేషన్

అయితే లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత చర్పలల్లి టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే.. ఈ పనులు తుది దశకు చేరాయి. ఆధునిక సౌకర్యాలతో ఆరు లైన్‌లతో చర్లపల్లి స్టేషన్‌ను విస్తరించారు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే రైళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు, నిలిపి ఉంచేందుకు వీలుగా పిట్‌ లైన్లు నిర్మించారు. చర్లపల్లి టెర్మినల్‌ వినియోగంలోకి వస్తే చాలా రైళ్లు సికింద్రాబాద్‌ ( Secunderabad) వెళ్లకుండా ఇక్కడి వరకే నడుస్తాయి. ఈ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 60 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నారు.

ఈ రైళ్లు చర్లపల్లి నుంచే..

  • కాజీపేట్‌ – సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్లే మచిలీపట్నం–షిరిడీ వీక్లీ ఎక్స్‌ప్రెస్, ముంబై–భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–షిరిడీ ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను చర్లపల్లి నుంచే నడిపించే ఛాన్స్ ఉంది..
  • మచిలీపట్నం నుంచి బీదర్ వరకు నడిచే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–లింగంపల్లి మధ్య నడిచే గౌతమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు, కాజీపేట – హడప్సర్‌ ( పూణే ) ట్రై వీక్లీ ఎక్స్ ప్రెస్, లింగంపల్లి–కాకినాడ మధ్య నడిచే కోకనాడ ట్రై వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్ రైలు, టాటా నగర్‌ – యశ్వంత్‌పూర్‌  వీక్లీ ఎక్స్‌ప్రెస్, షాలిమార్‌–హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌–చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇక నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే నడపనున్నారు.
  •  తిరుపతి – జమ్ముతావి హమ్‌సఫర్‌ వీక్లీ  ఎక్స్ ప్రెస్, గోరఖ్‌పూర్‌ నుంచి  యశ్వంత్‌పూర్‌ వరకు వెళ్లే వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్, నిజాముద్దీన్‌ – బెంగళూరు సిటీ మధ్య నడిచే రాజధాని సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను కూడా చర్లపల్లి స్టేషన్ నుంచి నడిపించాలని అధికారులు భావిస్తున్నారు.
  •  ఇక ఎంఎంటీఎస్‌ రెండో విడతలో నిర్మించిన మౌలాలి–సనత్‌నగర్‌ మార్గం పూర్తయింది. ఈ మార్గంలో ప్రస్తుతం గూడ్స్‌ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా నడిపించాలని ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో చర్లపల్లి మీదుగా ముంబై, ఢిల్లీ వైపు రాకపోకలు సాగించే పలు రైళ్లు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా చర్లపల్లి నుంచి మౌలాలి, సనత్‌నగర్, లింగంపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఇక ఫ్రీగా సిటీ రైల్వే స్టేషన్లు.

చర్లపల్లి టెర్మినల్‌ (Cherlapally Railway Terminal) అందుబాటులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని  సికింద్రాబాద్, నాంపల్లి (Nampalli), కాచిగూడ (Kachiguda) స్టేషన్‌లపైన భారం తగ్గిపోతుంది.  సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రతిరోజూ  200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.86 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇక్కడి 10 ప్లాట్‌ఫామ్‌లు ప్రతీ సీజన్ ప్రతీ రోు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్లాట్ ఫారంలు ఖాళీగా లేకపోవడంతో తరచూ పలు రైళ్లను నగర శివార్లలోనే నిలిపివేస్తున్నారు.  దీంతో రైళ్లు సకాలంలో స్టేషన్ కు రావడం లేదు.  దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నగర శివార్లలోనే పడిగాపులు కాయవలసి దుస్థితి తలెత్తుతోంది. చర్లపల్లి టర్మినల్ ప్రారంభమైతే సిగ్నల్‌ కోసం ఇలా వేచి చూడాల్సిన అవసరం ఉండదు. చర్లపల్లిలోనే దిగి అక్కడి నుంచి ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లిపోవచ్చు. దీనివల్ల కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై  కూడా ఒత్తిడి తగ్గిపోతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.


Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *