
Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు
Cherlapally Railway Terminal | ప్రయాణికులకు శుభవార్త.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఉంది. అయితే రైల్వే టర్మినల్ అందుబాటులోకి వచ్చాక సుమారు 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను రూపొందంచింది. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని ట్రైన్స్ ను చర్లపల్లి టెర్మినల్కు మార్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఆరు లైన్లతో అత్యాధునిక స్టేషన్
అయితే లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత చర్పలల్లి టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ...