Home » Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు
Bharat Atta

Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు

Spread the love

Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా ‘భారత్ అట్టా’ బ్రాండ్ పేరుతో కిలోకు రూ. 27.50 రాయితీపై గోధుమ పిండిని విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ‘భారత్ అట్టా’ని దేశంలోని 800 మొబైల్ వ్యాన్లు, 2,000 కంటే ఎక్కువ అవుట్ లెట్ల ద్వారా సహకార సంస్థలైన నాఫెడ్, ఎన్ సిసిఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించింది. ‘భారత్ అట్టా’ రాయితీపై అందుబాటులో ఉంటుంది, కాగా గోదుమ పిండి ధర నాణ్యత, ప్రదేశాన్ని బట్టి ప్రస్తుతం మార్కెట్ ధర రూ. 36-70 లోపు ఉంటుంది.

ప్రతిచోటా ఆటా

ధరల స్థిరీకరణ నిధి పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,000 టన్నుల ‘భారత్ అట్టా’ని కిలోకు రూ. 29.50 చొప్పున ఈ సహకార సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా విక్రయించింది.
‘భారత్ అట్టా’ ను కు సంబంధించిన 100 మొబైల్ వ్యాన్ లను ప్రారంభించిన తర్వాత కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. “ఇప్పుడు మేము పరీక్షించాం..  విజయవంతమయ్యాం, మేము దేశంలోని ప్రతిచోటా ఆటా పొందగలిగేలా అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. కిలో రూ. 27.50. కొన్ని ఔట్ లెట్ల ద్వారా మాత్రమే రిటైల్ చేయడంతో టెస్ట్ రన్ లో గోధుమ పిండి విక్రయాలు తక్కువగా జరిగాయి. అయితే, దేశవ్యాప్తంగా ఈ మూడు ఏజెన్సీలకు చెందిన 800 మొబైల్ వ్యాన్‌లు మరియు 2,000 అవుట్ లెట్ల ద్వారా ఉత్పత్తిని విక్రయించడం వల్ల ఈసారి మరింత మెరుగైన పిక్ అప్ ఉంటుందని గోయల్ చెప్పారు.

READ MORE  PM Modi in Wayanad | వాయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే.. బాధితులకు భరోసా.. 

న్యూస్ అప్ డేట్స్ కోసం మన వాట్సప్ చానల్ లో చేరండి

నాఫెడ్, ఎన్సిసిఎఫ్, కేంద్రీయ భండార్ లకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) నుంచి కిలో రూ. 21.50 చొప్పున సుమారు 2.5 లక్షల టన్నుల గోధుమలను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీన్ని గోధుమ పిండిగా మార్చి ‘భారత్ అట్టా’ బ్రాండ్ తో కిలో రూ.27.50కి విక్రయించనున్నారు. ఇది లభ్యతను పెంచడానికి, గోధుమ పిండి ధరలు స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
మరోవైపు శనగ పప్పు, టమాటా, ఉల్లి వంటి కొన్ని నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరకు విక్రయించడంలో కేంద్రం జోక్యం చేసుకోవడం ధరల పెరుగుదలలో మంచి ఫలితాలను ఇస్తోందని, ఈ మూడు ఏజెన్సీల మొబైల్ వ్యాన్లు అవుట్ లెట్లలో గోధుమపిండి కిలో రూ.27.50, శనగపప్పు కిలో రూ.60, ఉల్లిపాయలు కిలో రూ.25.కు విక్రయిస్తాయని గోయల్ తెలిపారు.

READ MORE  Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..