Friday, April 4Welcome to Vandebhaarath

BSNL 4G Service  | కొత్తగా వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 

Spread the love

BSNL 4G Service | ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ ఎన్ ఎల్ వినియోగ‌దారులు ఎదుర్కొంటున్న సిగ్న‌ల్ స‌మ‌స్య‌ల‌ను నివారించేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లు ప్రైవేట్ టెల్కోలు ఇటీవ‌ల తమ టారీఫ్‌ల‌ను పెంచ‌డంతో చాలా మంది ఇపుడు బిఎస్ ఎన్ ఎల్ వైపు చూస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే ఆ సంస్థ‌
వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించ‌డానికి సిద్ధ‌మైంది. దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్య‌లో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఇన్‌స్టాల్‌ చేసినట్లు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12లక్షల టవర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

READ MORE  TGSRTC | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఆ రూట్ లో కొత్త‌గా బ‌స్ స‌ర్వీసులు

ఇప్పటి వరకు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 12వేల వరకు సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఇందులో పంజాబ్‌లో 6వేలు, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా సర్కిల్‌లో యాక్టివ్‌లో ఉన్నాయి. 4జీ సేవ‌ల(BSNL 4G ) కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ టీసీఎస్‌, తేజస్‌ నెట్‌వర్క్‌, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నెల ప్రారంభంలో తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీని కొత్తగా ప్రారంభించింది. నోచిలి, కొలత్తూరు, పల్లిపేట్, తిరువెల్లావోయల్, పొన్నేరి తదితర ప్రాంతాల్లో సేవలు ప్ర‌యోగాత్మ‌కంగా మొద‌లుపెట్టింది. త్వరలో తమిళనాడు రాజధాని చెన్నైలో 4జీ అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు వెల్ల‌డించారు. 4జీ సేవలు ప్రారంభ‌మైన త‌ర్వాత‌ వినియోగదారులకు ఉచితంగా సిమ్‌కార్డులను అందిస్తోంది. ఇప్పటికే కొత్త సిమ్‌ కార్డులున్న యూజర్లు 4జీ అప్‌గ్రేడ్ కానున్నారు. ఈ లాంచ్ ఆఫర్ మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

READ MORE  BSNL News : మాన్‌సూన్ డబుల్ బొనాంజా.. నెలకు రూ. 399కి ఫైబర్ బేసిక్ ప్లాన్‌ తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్

రూ. 26,316 కోట్లతో ఇంట‌ర్నెట్ లేని గ్రామాలను (మొత్తం 24,680 గ్రామాలు) కవర్ చేయడానికి 4G ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించడం దీని లక్ష్యం. ప్రభుత్వం USOF (యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) ద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *