Transco & Discoms | ఇంట్లో నుంచే విద్యుత్ సేవలు.. అందుబాటులోకి ఆన్ లైన్ పోర్టల్

Transco & Discoms | ఇంట్లో నుంచే విద్యుత్ సేవలు.. అందుబాటులోకి ఆన్ లైన్  పోర్టల్

పోర్టల్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

TSNPDCL |  హైదరాబాద్: హెచ్ టీ లైన్ల తరలింపు సేవలతో సహా డిస్కం, ట్రాన్స్ కో ( Transco & Discoms) ల మధ్య వివిధ రకాల కార్యకలాపాలు ఇక నుంచి ఆన్ లైన్ లోనే  అందుబాటు లోకి రానున్నాయి. ఈ సేవ లకు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్  ను డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

Transco & Discoms : 132, 220, 400 కేవీ కొత్త సర్వీసులు, 11 కేవీ/ 33 కేవీ కొత్త సర్వీసులతో పాటు హెచ్ టీ/ హెచ్ టీ సర్వీ సుల కోసం గతంలో మాదిరిగా కార్యాలయాలు (DISCOM office) చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఇక ఉండదు. ఇంటి నుంచే ఆన్ లైన్ లో  దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలోగా విద్యుత్ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి వేగవంతంగా సేవలు అందించే విధంగా  కొత్తగా సాఫ్ట్ వేర్ ను రూపొందించారు.  ఈ సేవల కోసం ఆన్ లైన్ పోర్టల్లో  దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడు పని ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే వెసులు బాటు  ఉంది.

READ MORE  ఆగస్టు 1న 466 కొత్త 108 అంబులెన్స్‌లు, 102 అమ్మ ఒడి వాహనాలు ప్రారంభం

ప్రయోజనాలు ఏంటీ?

  • వినియోగదారులు తమ దరఖాస్తును కార్యాలయాల్లో కాకుండా నేరుగా ఆన్ లైన్ లోనే సమర్పించవచ్చు.
  •  సింగిల్ విండో విధానం ద్వారా అధికారులు దరఖాస్తును వేగవంతంగా పరిశీలించి ప్రక్రియను పూర్తి చేస్తారు.
  • వినియో గదారులు డిస్కం ఆఫీసుకు వెళ్లకుండా ఆన్ లైన్ లోనే  సంబంధిత సేవా రుసుమును చెల్లించవచ్చు.
  • డిస్కం వారు వినియోగదారునితో నిరంతరం అందుబాటులో ఉండి దరఖాస్తు చేసుకున్న సేవకు సంబంధించిన స్టేటస్ వివరాలను కమ్యూనికేట్ చేస్తారు.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

READ MORE  కేసీఆర్ నుంచి జానా రెడ్డి వరకు.. అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు వీరే...

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

3 thoughts on “Transco & Discoms | ఇంట్లో నుంచే విద్యుత్ సేవలు.. అందుబాటులోకి ఆన్ లైన్ పోర్టల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *