Home » Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..

Spread the love

స్వామివారి దర్శన సమయాలను పొడింగించిన ఆలయ ట్రస్టు

Ayodhya Ram Mandir | అయోధ్యలో నూతనంగా ప్రారంభించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గత సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సాధారణ భక్తుల కు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) సమర్పించుకున్నారు.

సాధారణ భక్తులకు అనుమతించిన తొలి రోజే రామ మందిరానికి రూ.3 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్‌ వెల్లడించింది. ఆలయంలో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కౌంటర్లతోపాటు, ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు మొత్తం రూ.3.17 కోట్లు విరాళంగా వచ్చినట్లు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా వెల్లడించారు.

READ MORE  Telangana Inter Results | తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. టాప్ త్రీ జిల్లాలు ఇవే..

మరోవైపు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తొలిరోజు 5 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నారు.. రెండో రోజు బుధవారం కూడా 3 లక్షల మంది మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు వచ్చారు. పటిష్టమైన భద్రత మధ్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.. అయోధ్యలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ మంత్రులు ప్రస్తుతం దర్శనానికి వెళ్లవద్దని ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. ప్రొటో కాల్స్‌ కారణంగా సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగుతుందని, ఈ క్రమంలో కేంద్ర మంత్రులు ఫిబ్రవరిలో బాల రాముడి దర్శనానికి వెళ్లవద్దని తెలిపారు. మార్చిలో తమ పర్యటన కు ప్లాన్‌ చేసుకోవాలని మోదీ సూచించారు..

READ MORE  New SIM card rules | కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి కొత్త నిబంధనలు ఇవే.. ఇకపై వారికి ఓటీపీ అవసరం లేదు.

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

ఇదిలా ఉండగా.. Ayodhya Ram Mandir లో భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన సమయాలను పొడిగిస్తూ రామ తీర్థ్‌ ట్రస్టు నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుతం సాయంత్రం 7 గంటల వరకే ఉన్న దర్శన సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడగించారు. కాగా, దర్శనానికి 10- 15 రోజుల తర్వతనే రావాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు రద్దీ తగ్గించేందుకు అయోధ్య కు బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు.

READ MORE  First Bullet Train | భారత్ లో మొద‌టి బులెట్ రైలుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..