Saturday, August 30Thank you for visiting

Andhrapradesh

Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

Andhrapradesh
AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. జూన్ 15, 2024 శనివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.Weather Updates రానున్న ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలు బీహార్...
AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్..  మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

AP Cabinet | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..

Andhrapradesh
AP Cabinet | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రుల‌కు శాఖ‌లను కేటాయిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌ల‌తో పాటు శాంతి భ‌ద్ర‌త‌లు త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. హోం అఫైర్స్, విప‌త్తు శాఖను వంగ‌ల‌పూడి అనిత‌కు కేటాయించారు. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు. AP Cabinet  శాఖ‌ల కేటాయింపు ఇలా..చంద్ర‌బాబు ( ముఖ్య‌మంత్రి ) – సాధార‌ణ ప‌రిపాల‌న‌, శాంతి భ‌ద్ర‌త‌లు ప‌వ‌న్ కల్యాణ్( ఉప ముఖ్య‌మంత్రి) – పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి స‌ర‌ఫ‌రా, పర్యావ‌ర‌ణ‌, అట‌వీ, సైన్స్ అండ్ టెక్నాల‌జీ నారా లోకేశ్ – మాన‌వ వ‌న‌రులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్, ఆర్టీజీ కింజార‌పు అచ్చెన్నాయుడు – వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌, పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి, మ‌త్స్య‌శాఖ‌ అనిత వంగ...
Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Andhrapradesh
Elections 2024:  ఎనిమిది నెలల కిందట‌ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వెళ్లినప్పుడు 74 ఏళ్ల రాజకీయ వేత్త శ‌కం ముగిసింద‌ని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ ప‌నైపోయింద‌ని భావించారు. ఆ సమయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోయిన‌ట్లు అనిపించింది. చంద్ర‌బాబు, ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి త‌దిత‌రులు బాబు నిర్భందాన్ని టీడీపీకి సానుభూతి ఓట్లుగా మార్చడానికి పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. చంద్రబాబు నాయుడుకు 2024లో ఓటమిపాలైతే.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితానికి తెరప‌డిన‌ట్లేన‌నుకున్నారు. అయితే చంద్ర‌బాబు వెనుక‌డుగు వేయ‌లేదు.. మరోసారి BJPతో పొత్తు పెట్టుకుని, ఊహించ‌ని విధంగా అపూర్వ విజ‌యం సొంతం చేసుకున్నారు. సినిమాటిక్ టర్నింగ్ పాయింట్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత రాజమండ...
ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే..  ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే.. ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

Andhrapradesh, Elections
Macherla Assembly Constituency | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Pinnelli Venkatarami Reddy) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (EVM) ధ్వంసం చేసిన వీడియో  ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెబ్‌క్యామ్ ఫుటేజీలో, ఎమ్మెల్యే బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని నేలపై పడవేయడం కనిపించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఈవీఎంను తొక్కుతూ దొరికిపోయారు.ఈ ఏడాది మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ వీడియో రికార్డైనట్లు సమాచారం.ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (మే 21) గుర్తించింది. దీంతో రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.మాచర్ల (macherla) అసెంబ్లీ నియోజకవర్గం లోని పీఎస్ నంబ...
TSRTC Buses : ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. విజ‌య‌వాడ‌కు ప్రతీ 10 నిమిషాల‌కు ఒక TSRTC బస్సు,

TSRTC Buses : ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. విజ‌య‌వాడ‌కు ప్రతీ 10 నిమిషాల‌కు ఒక TSRTC బస్సు,

Andhrapradesh, Telangana
Hyderabad to Vijayawada Buses : వేస‌వి సెల‌వుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ ఆర్టీసీ(TSRTC) బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్ర‌యాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక‌ బస్సును న‌డిపించ‌నున్న‌ట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక‌ ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయ‌ని స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. 10 శాతం డిస్కౌంట్ Hyderabad to Vijayawada Buses బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నామ‌ని సజ్జనార్ తెలిపారు. తిరుగు ప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని వివ‌రించారు. టీఎస్ఆ ర్టీసీ బస్సుల్లో అడ్...
Tirumala | ఏప్రిల్‌లో తిరుపత వెళ్తున్నారా? ఈ తేదీలను గమనించండి!

Tirumala | ఏప్రిల్‌లో తిరుపత వెళ్తున్నారా? ఈ తేదీలను గమనించండి!

Andhrapradesh
Tirumala | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవ‌స్థానం లో మార్చి నెల ఉత్సవాలు ముగిశాయి. ఏప్రిల్‌లో తిరుమలలో జరిగే ఉత్సవాలు, ఉత్సవాల వివరాలను దేవస్థానం విడుదల చేసింది. మ‌రికొది రోజుల్లో పరీక్షలు ముగిసి పాఠశాల, కళాశాల విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. చాలా మంది వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లాలని ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. సరదా, వేడుకల పర్యటన మాత్రమే కాదు, చాలా మంది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవ‌స్థానానికి కుటుంబ సమేతంగా దర్శించుకోవాలనేది చాలా కుటుంబాల ప్లాన్. కాబట్టి, మీరు ఈ ఏప్రిల్‌లో తిరుపతిని సందర్శించాలని ఆలోచిస్తున్న‌ట్లయితే.. ఈ తేదీలలో ఏప్రిల్‌లో తిరుమల తిరుపతి ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా కార్య‌క్రమాలు ఇక్కడ ఉన్నాయి. నోట్ చేసుకోండి.తిరుమల తిరుపతి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనం కోసం...
Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..

Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..

Andhrapradesh, Telangana
Vande Bharat Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకొస్తోంది భార‌తీయ రైల్వే.. ఈ నెల 12న ప్రధాని న‌రేంద్ర‌ మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.Vande Bharat Trains From Secunderabad To Visakha: ఇండియ‌న్ రైల్వేస్‌.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ పట్నానికి (Visakha) కొత్త‌గా వందే భారత్ రైళ్ల‌ను న‌డిపించ‌నుది. భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ కు కూడా వందేభార‌త్‌ రైళ్లను మంజూరు చేసింది. ఈ నెల 12న మంగ‌ళ‌వారంప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీలో సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఒక‌ వందే భారత్ రైలు స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ తొలి వందే భారత్ 2023 జనవరి 15 నుం...
AP Elections |  ఏపీలో ఒంట‌రిగానే బీజేపీ పోటీ..!! 

AP Elections |  ఏపీలో ఒంట‌రిగానే బీజేపీ పోటీ..!! 

Andhrapradesh
AP Elections | న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు సమీపిస్తున్నాయి.  త్వ‌ర‌లోనే ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఏప్రిల్ మొద‌టి వారంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగే చాన్స్ ఉంద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.  ఈ ఎన్నిక‌ల‌తో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జరగనున్నాయి.  ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో  రాజ‌కీయాలు  ర‌స‌వ‌త్తరంగా మారాయి. ఎన్నికల్లో అధికార వైసీపీని  ఓడించేందుకు టీడీపీ – జ‌న‌సేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే..  ఈ రెండు పార్టీలో ఇటీవలే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల   మొదటి జాబితాను కూడా విడుదల చేశాయి.  అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా టీడీపీ – జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ విషయంలో బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం.  టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్లకుండా  బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఆంధ్రప్రదే...
TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, రూ.10కే భోజ‌నం.. టీటీడీ కీలక నిర్ణయాలు

TTD Board : కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, రూ.10కే భోజ‌నం.. టీటీడీ కీలక నిర్ణయాలు

Andhrapradesh
TTD Board Decisions : టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అలాగే ముఖ్య‌మంత్రి జగన్, టీటీడీపై విమర్శలు చేసిన రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి (TTD Board Meeting) సమావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి విలేక‌రుల‌కు వివరించారు. ఇక నుంచి ప్రతి సంవ‌త్స‌రం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు రూ.10కే భోజనం TTD Board Decisions  | గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు బంగారు పూత, అలిపిరి, గాలి గోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు అనుమ‌తించారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి తీర్మాన...
Janasena TDP First List | టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్

Janasena TDP First List | టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్

Andhrapradesh
 Janasena TDP First List : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ బ‌హిరంగ‌ సభలు పెట్టి ఒకరినొకరు తీవ్ర‌స్థాయిలో దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది.Janasena TDP First List టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై తమ తమ పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన మొద‌టి జాబితాలను వెల్లడించారు. ఈ జాబితాలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించచ‌గా, జనసేన మొత్తం 175 స్థానాలకు గాను 24 అసెంబ్లీ స్థానాల్లో అలాగే మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాల్లో మూడు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయనుంది. తొలి జాబితాలో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.టీడీపీ తొలి జాబితాలోని అభ్యర్...