Cancellation OF Trains | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్.. నిడదవోలు-కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను ముమ్మరం చేసింది. దీంతో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. గుంటూరు-విశాఖ ( సింహాద్రి), విశాఖ-లింగంపల్లి (జన్మభూమి), విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (ఉదయ్), విశాఖ-తిరుపతి (డబుల్ డెక్కర్), గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఎగువ దిగువ మార్గాల్లో రద్దయ్యాయి.
రద్దయిన రైళ్లు ఇవే..
జూన్ 24 నుంచి ఆగస్టు 10 వరకు
- రాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్,
- విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్,
- గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి,
- విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి,
- విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్,
- విశాఖ- విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ ప్రెస్,
- గుంటూరు- విశాఖ (22702) ఉదయ్ ఎక్స్ ప్రెస్,
- విశాఖ-గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్ ప్రెస్,
- విశాఖ- తిరుపతి 22707) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు.
జూన్ 23 నుంచి ఆగస్టు 10 వరకు
- మచిలీపట్నం- విశాఖ (17219),
- విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్ ప్రెస్,
- గుంటూరు-రాయగఢ్ (17243),
- విశాఖ- లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి.
ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు
- రాయగడ-గుంటూరు (17244),
- లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశారు.
ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు
- తిరుపతి-విశాఖ (22708) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దయిన జాబితాలో ఉన్నాయి
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..