Home » హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు
Amazfit Cheetah Smartwatches

హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు

Spread the love

 

Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త  స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. .
వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు లొకేషన్ పాయింట్‌లను కూడా సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. Amazfit
స్మార్ట్‌వాచ్‌లు రెండూ మల్టీస్పోర్ట్ ఫోకస్‌తో రూపొందించబడ్డాయి. అవి డ్యూయల్-బ్యాండ్  సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నాతో వస్తాయి. ఇది 99.5 శాతం ఖచ్చితమైన
లొకేషన్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

READ MORE  Jio cheapest plans | ముఖేష్ అంబానీ మాస్టర్‌స్ట్రోక్, అపరిమిత కాలింగ్, హై-స్పీడ్ డేటాతో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు.. త్నుత ర 90 రోజుల పాటు కేవలం రూ.

Amazfit Cheetah, Cheetah Pro ధర

అమాజ్‌ఫిట్ చీతా ధర $229.99 (దాదాపు రూ. 18,700)గా నిర్ణయించారు.. ఇది  ఏకైక స్పీడ్‌స్టర్ గ్రే కలర్ షేడ్‌లో లభిస్తుంది. మరోవైపు, Amazfit Cheetah Pro
ధర $299.99 (దాదాపు రూ. 24512). రెండు స్మార్ట్‌వాచ్‌లు Amazfit స్టోర్‌లు , Amazon, AliExpress లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

Amazfit Cheetah ఫీచర్లు

Amazfit Cheetah 1.39-అంగుళాల (454×454 పిక్సెల్‌లు) HD  AMOLED డిస్‌ప్లేతో టెంపర్డ్ గ్లాస్, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌ను కలిగి ఉంది. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. కొత్త Amazfit స్మార్ట్ వాచ్ రియల్ టైమ్ GPS ట్రాకింగ్, రూట్ నావిగేషన్ కోసం డ్యూయల్-బ్యాండ్ GPS టెక్నాలజీని కలిగి ఉంది. రూట్ ఫైల్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి వాటిని నావిగేట్ చేయడానికి కూడా వాచ్ వినియోగదారులను అనుమతిస్తుంది.

READ MORE  New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?

అమేజ్‌ఫిట్ చీటా రన్నింగ్, వాకింగ్ స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, డ్యాన్స్, ఇతర  స్పోర్ట్స్ తో సహా 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్, ఒత్తిడి స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే బయోట్రాకర్ PPG బయోమెట్రిక్ ఆప్టికల్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది స్లీప్ మానిటైజేషన్ వంటి హెల్త్ రిమైండర్లకు మద్దతు ఇస్తుంది. Amazfit Cheetah 440mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఎక్కువ వినియోగిస్తే 7 రోజుల వరకు, సాధారణ ఉపయోగంతో 14 రోజుల వరకు.. బ్యాటరీ
సేవర్ మోడ్ ఆన్‌లో ఉంటే 45 రోజుల వరకు ఉంటుంది.

READ MORE  BSNL New Recharge Plan : 120GB డేటా, 60 రోజుల పాటు అపరిమిత కాల్స్

అమాజ్‌ఫిట్ చీటా ప్రో స్పెసిఫికేషన్‌లు

Amazfit Cheetah Pro టైటానియం అల్లాయ్ బెజెల్, నైలాన్ స్ట్రాప్‌తో 1.45-అంగుళాల HD AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 150 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌ల కలిగి ఉంటుంది. బయోట్రాకర్ PPG బయోమెట్రిక్ ఆప్టికల్ సెన్సార్‌తో కూడిన స్మార్ట్ హెల్త్ మానిటర్లు, బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ స్టోరేజ్ వంటి ఇతర ఫీచర్లు Amazfit Cheetah స్టాండర్డ్ వేరియంట్‌తో సమానంగా  ఉంటాయి. Amazfit Cheetah Pro కూడా 440mAh బ్యాటరీతో వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..