Home » 14-hour Workday Proposal : బెంగళూరులో ఆందోళననకు సిద్ధమవుతున్న ఐటీ ఉద్యోగులు
14-hour Workday Proposal

14-hour Workday Proposal : బెంగళూరులో ఆందోళననకు సిద్ధమవుతున్న ఐటీ ఉద్యోగులు

Spread the love

14-hour Workday Proposal (బెంగళూరు): ఐటి ఉద్యోగుల పని వేళలను పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించినందుకు నిరసనగా కర్ణాటక స్టేట్ ఐటి/ఐటిఇఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (KITU ) ఆగస్టు 3వ తేదీన‌ శనివారం ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసనను నిర్వహించనుంది.

ఈ సంద‌ర్భంగా త‌మ డిమాండ్ల గురించి KITU ఆధ్వ‌ర్యంలో రెండు వారాల పాటు శాంతియుతంగా నిర‌స‌న తెలుప‌నున్నారు. ఇందులో భాగంగా IT పార్కుల వద్ద గేట్ సమావేశాలు, వీధి నిరసనలు (street protests) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత కర్ణాటక దుకాణాలు, వాణిజ్య సంస్థల (సవరణ) బిల్లు ప్రమాణంగా 14 గంటల పనిదినాలను ఏర్పాటు చేయాలని కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు 300 మందికి పైగా ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ కార్మికులు నిరసనలో పాల్గొంటారని కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్‌ అడిగా ప్రకటించారు.

READ MORE  Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను “అమానవీయం” అని ఖండిస్తూ, ఇది ఉద్యోగుల ప్రాథమిక హక్కులను దెబ్బతీస్తుందని అన్నారు. తాజా సవరణ ప్ర‌కారం.. కంపెనీలను ప్రస్తుత మూడు-షిఫ్ట్‌ల నుంచి రెండు-షిఫ్ట్ సిస్టమ్‌కు మార్చుతున్నారు. ఇది వర్క్‌ఫోర్స్‌లో మూడింట ఒక వంతు మందిని త‌గ్గిస్తుంది. అని ఆయన చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు 300 మందికి పైగా ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ కార్మికులు నిరసనలో పాల్గొంటారని కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్‌ అడిగా ప్రకటించారు.

READ MORE  త్వరలోనే అంద‌రికీ డిజిటల్ హెల్త్ కార్డులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) అధ్యయనాలను ప్రస్తావిస్తూ, సుదీర్ఘ‌మైన‌ పని గంటలు (14-hour Workday Proposal ) హార్ట్‌ స్ట్రోక్ సంబంధిత మరణాల ప్రమాదాన్ని 35 శాతం, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ నుండి 17 శాతం వరకు పెంచవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని పరిశ్రమల నుంచి ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ ప్రకటించారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

READ MORE  Crop Loan | మూడు విడతలుగా రైతు రుణమాఫీ.. నేడే రైతుల ఖాతాల్లో నగదు..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..