
Second Fhase Loan Waiver : రాష్ట్ర రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శాసన సభ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ ( TG Raithu Runa Mafi )నిధులను విడుదల చేశారు. ఇప్పటికే లక్ష రూపాయల రుణబకాయిలు ఉన్నవారికి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేశారు. తెలంగాణలో మొత్తం 6,40,223 మందికి రూ.6190.01 కోట్ల మేర రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఇక మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98 కోట్లు విడుదల చేశారు. కాగా రాష్ట్రంలోని 17పార్లమెంటు నియోజక వర్గాల నుంచి లబ్దిదారులను రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు.
తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే రూ.లక్ష రుణాన్ని మాఫీ చేసింది. తెలంగాణలో 11,34,412 మందికి రూ.6,034 కోట్లను ఇప్పటికే చెల్లించేశారు. అలాగే రెండో విడతలో 6,40,223 మందికి రూ. 6190 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ లబ్ది పొందిన వారిలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, ఆఖరు స్థానంలో హైదరాబాద్ నిలిచింది.
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో 2024 మే6న హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. దానిని ఇప్పుడు సగర్వంగా నిలుపుకున్నామని చెప్పారు. తమ హామీలను గత ప్రతిపక్షాలు హేళన చేశారనిగత ప్రభుత్వం చేసిన రుణమాఫీ అసలు కంటే వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నా కూడా.. రుణమాఫీ చేయలేదని, రూ.19వేల కోట్ల అంచనాలు వేసి నాలుగు విడతల్లో చెల్లింపులు చేసి రూ.7వేలు కోట్లను మాత్రమే చెల్లించారని ఆరోపించారు. రెండు విడతల్లో రూ. 25 వేల కోట్లను మాత్రమే చెల్లించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఇదిలావుండగా హైదరాబాద్‌లో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికల్లో రైతు రుణమాఫీ (TG Raithu Runa Mafi ) కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రతీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 15 మంది లబ్దిదారులకు సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..