
14-hour Workday Proposal : బెంగళూరులో ఆందోళననకు సిద్ధమవుతున్న ఐటీ ఉద్యోగులు
14-hour Workday Proposal (బెంగళూరు): ఐటి ఉద్యోగుల పని వేళలను పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించినందుకు నిరసనగా కర్ణాటక స్టేట్ ఐటి/ఐటిఇఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (KITU ) ఆగస్టు 3వ తేదీన శనివారం ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసనను నిర్వహించనుంది.ఈ సందర్భంగా తమ డిమాండ్ల గురించి KITU ఆధ్వర్యంలో రెండు వారాల పాటు శాంతియుతంగా నిరసన తెలుపనున్నారు. ఇందులో భాగంగా IT పార్కుల వద్ద గేట్ సమావేశాలు, వీధి నిరసనలు (street protests) ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత కర్ణాటక దుకాణాలు, వాణిజ్య సంస్థల (సవరణ) బిల్లు ప్రమాణంగా 14 గంటల పనిదినాలను ఏర్పాటు చేయాలని కోరింది. మధ్యాహ్నం 2 గంటలకు 300 మందికి పైగా ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ కార్మికులు నిరసనలో పాల్గొంటారని కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్ అడిగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను “అమానవీయం” అని ఖండిస్తూ, ఇది ఉద్యోగుల ప్రాథమిక హక్...