ఎన్నికల నియమాలపై అవగాహన ఉండాలి
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
వరంగల్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని వరంగల్ జిల్లా పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హా లో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికలకు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, వర్ధన్నపేటకు సంబంధించి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీవో క్రిష్ణవేణి రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ బాధ్యతల నిర్వహణ కోసం నియమించిన నోడల్ అధికారులకు వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, విధి విధానాలపై కలెక్టర్ వివిధ అంశాల వారీగా వివరించారు. జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి 16 అంశాల వారీగా జిల్లా స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారులను నియమించామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మ్యాన్ పవర్, శిక్షణ, మెటీరియల్ మేనేజ్ మెంట్, రవాణా నిర్వహణ, కంప్యూటరైజేషన్, స్వీప్ కార్యక్రమాలు, శాంతి భద్రతలు, ఈవీఎంల నిర్వహణ, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఓటరు జాబితా, ఓటర్ హెల్ప్ లైన్ తదితర అంశాలకు వివిధ శాఖల అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు
ప్రతీ నోడల్ అధికారి వారికి అప్పగించిన బాధ్యతపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈసీఐ(ECI) నుంచి వచ్చే గైడ్ లైన్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్ డేట్ గా ఉండాలన్నారు. ఎలక్షన్ కి సంబంధిచి వచ్చే ప్రతీ సర్క్యలర్ లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అలర్ట్ గా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను క్షుణ్ణంగా ఇప్పటి నుంచే అవగాహన కలిగి ఉండాలని …ఎలాంటి అనుమానాలు ఉన్నా.. RO లను అడిగి తెలుసుకోవాలని లేకుంటే ఎలక్షన్ సెల్ లో గాని, ECI వెబ్ సైట్ లో గాని తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో GWMC కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకాడే, శ్రీవత్స, ఆర్డీవోలు, జిల్లా స్థాయి, మండల స్థాయి నోడల్ అధికారులు పాల్గొన్నారు