Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15 నుండి ఈ మార్గాలలో నడుస్తుంది.. వివరాలు ఇవీ..
Vande Bharat Sleeper : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వందే భారత్ రైలు అభిమానులకు శుభవార్త.. వందే భారత్ రైళ్లు విజయవంతమైన తర్వాత, భారతీయ రైల్వే త్వరలో ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ వెర్షన్ ను కానుకగా ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అనేక రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి వందే భారత్ కొత్త స్లీపర్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో నడపవచ్చో చూడండి..
వందే భారత్ ఏ మార్గాల్లో నడుస్తుంది?
నివేదికల ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్ల (Vande Bharat Sleeper) ను నడపాలని ప్రతిపాదించారు. కాచిగూడ-విశాఖపట్నం, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె వంటి రద్దీ అయిన రూట్లలో కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని అధికారులు భావిస్తున్నారు. కాగా కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉండనున్నాయి. ఈ రైళ్లు రాత్రిపూట ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. టికెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
వందే భారత్ స్లీపర్ ఫీచర్లు..
కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ రైలును బయటి నుంచి చూస్తే దాదాపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే కనిపిస్తుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లలో ప్రయాణికులకు 823 బెర్త్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఈ రైలులో ప్రయాణికులకు విమానం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. భోజనం, తాగునీరు అందించేందుకు ప్యాంట్రీ కార్ ఏర్పాటు ఉంటుంది. వెలుపలి భాగంలో ఆటోమేటిక్ డోర్, దుర్వాసన లేని టాయిలెట్ ఉంటాయి. ఈ రైలు కోచ్‌లు పూర్తిగా సౌండ్ ప్రూఫ్‌గా ఉంటాయి. ప్రయాణీకులు కూదుపులు లేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
త్వరలో వందే భారత్ మెట్రో
దేశవ్యాప్తంగా దగ్గరి దగ్గరి ప్రధాన నగరాలను కలుపుతూ వందే భారత్ మెట్రో సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు కాన్పూర్-లక్నో, ఢిల్లీ-మీరట్, ముంబై-లోనావాలా, వారణాసి-ప్రయాగ్‌రాజ్, పూరి-భువనేశ్వర్, ఆగ్రా-మథుర మధ్య నడిచే చాన్స్ ఉంది. ఒక్కో కోచ్‌లో 250 మంది సులభంగా ప్రయాణించవచ్చని తెలుస్తోంది. వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ను త్వరలో రైల్వే నిర్వహించనుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..