Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ సహా పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురిసింది.
నగరంలో చాలా భాగం – సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, ఎల్‌బి నగర్, బాలానగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, కొండాపూర్, మాదాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి, హైటెక్ కారిడార్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, గోల్కొండ, మణికొండ, టోలిచౌకి, జూబ్లీ హిల్స్, షేక్‌పేట్, నానల్ నగర్, బండ్లగూడ, రాజేంద్రనగర్, పాతబస్తీ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, కోటి, అబిడ్స్, బేగంపేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, చందానగర్, మూసాపేట్, కుసాహిగూడ, చీకలగూడ, జీడిమెట్ల, మర్రెడ్‌పల్లి, ఈసీఐఎల్‌లో భారీ వర్షం పడింది. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో అత్యధికంగా 77.5 మి.మీ, ఖైరతాబాద్‌లో 76.5, ముషీరాబాద్‌లో 73 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటమునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు..
Heavy Rain Alert : రాష్ట్రంలో రానున్న ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడిస్తూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన వాయుగుండం, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పడిన తుఫాను గంగా పశ్చిమ బెంగాల్ మరియు ఆనుకుని ఉన్న జార్ఖండ్ మరియు ఒడిశా మీదుగా మరొక సర్క్యులేషన్‌లో కలిసిపోయింది. ఈ వాతావరణ వ్యవస్థ జూలై 20 వరకు తెలంగాణలో భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక మంగళవారం నుండి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఈ నెల 18, 19వ తేదీల్లో మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..