TSRTC Free Travel : మహిళా ప్రయాణికులకు అలర్ట్.. ఒరిజినల్ కార్డు తప్పనిసరి.. ఫోన్ లో చూపిస్తే చెల్లదు..
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు (టీఎస్ఆర్టీసీ) కీలక సూచనలు చే సింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని(TSRTC Free Travel) వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గు ర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొంది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ ఐడీ కార్డైన ఈ పథకానికి వర్తిస్తుందన్నారు. అయితే పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్ ఫోన్లు, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ కాపీలు చూపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడుతుండడంతోపాటు ప్రయాణ సమయం కూడా పెరుగు తున్నది. దీం...