Home » Telangana Results : రేపే ఇంటర్ తరగతి పరీక్ష ఫలితాలు..
SSC Exams

Telangana Results : రేపే ఇంటర్ తరగతి పరీక్ష ఫలితాలు..

Spread the love

Telangana Results : తెలంగాణలో ఎస్సెస్సీ పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ఈనెల 30న (మంగళవారం) విడుదల చేయనుంది ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే.. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా,  2,50,433 మంది బాలికలు ఉన్నారు. జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 20 వరక నిర్వహించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో వ్యాల్యూయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వేగంగా మూల్యాంకన  ప్రక్రియను పూర్తి చేశారు.  గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభం కాగా అదే క్రమంలో  ఫలితాలు కూడా ముందుగానే విడుదల చేస్తున్నారు.

రేపు ఇంటర్ ఫలితాలు

ఇదిలా ఉండగా తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను  విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ామె తెలిపారు. ఫలితాల కోసం విద్యార్థులు https://tsbie.cgg.gov.in వెబ్ సైట్ చెక్ చేసుకోవచ్చు. ఇక ఇంటర్ పరీక్షల విషయానికొస్తే.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు  నిర్వహించారు. సుమారు 9,80,978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.  ఇందులో 4,78,527 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు కాగా,  4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 48,277 మంది ఫస్టియర్ విద్యార్థులు , 46,542 మంది సెకండియర్  విద్యార్థులు పరీక్షలు రాశారు.

READ MORE  పాఠశాల విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..