Secunderabad: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను (Summer special trains ) నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ (Shalimar), సాంత్రాగాచి ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించారు.
సికింద్రాబాద్-సాంత్రాగాచి రైలు
సికింద్రాబాద్-సాంత్రాగాచి (Santragachi) (07223) రైలు ప్రతీ శుక్రవారం బయలుదేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 29 వరకు మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని తెలిపారు. ప్రతీ శనివారం తిరుగు ప్రయాణమయ్యే సాంత్రాగాచి-సికింద్రాబాద్ (07224) రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు.
రైలు ఆగే స్టేషన్లు : సికింద్రాబాద్-సాంత్రాగాచి (07223) రైలు నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల లో ఆగుతుందని తెలిపారు. అలాగే గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ -షాలిమార్ (07225) ప్రత్యేక రైలు
సికింద్రాబాద్ -షాలిమార్ (07225) ప్రత్యేక రైలు ఈనెల 15 నుంచి జూన్ 24 వరకు ప్రతీ సోమవారం నడుస్తుంది. అలాగే షాలిమార్-సికింద్రాబాద్(07226) ప్రత్యేక రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ప్రతీ మంగళవారం బయలుదేరుతుంది.
హాల్టింగ్ స్టేషన్స్ : కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెర్హంపూర్, కుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జైపూర్ కియోజర్ రోడ్, బాలసోర్, ఖరగ్ పూర్, సాంత్రగాచి.
సికింద్రాబాద్ -కొల్లం (07193) మధ్య ప్రత్యేక రైలు
సికింద్రాబాద్ -కొల్లం (07193) మధ్య ప్రత్యేక రైలు ఏప్రిల్ 17, 24వ తేదీల్లో అలాగే మే 1, 8, 15, 22, 29వ, జూన్ 5, 12, 19, 26వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుందని ఎస్‌సీఆర్(SCR) అధికారులు వివరించారు. తిరుగుప్రయాణంలో కొల్లం-సికింద్రాబాద్(07194) స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 వతేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
హాల్టింగ్ స్టేషన్స్ : ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది.
Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..