Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Mahila Shakti canteens : త్వరలో మహిళా శక్తి కాంటీన్లు..

Mahila Shakti canteens : త్వరలో మహిళా శక్తి కాంటీన్లు..

Telangana
Mahila Shakti canteens| హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 150 'మహిళా శక్తి' క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ అవుట్‌లెట్‌లు తక్కువ ధరతో  ఆహారాన్ని అందిస్తాయి. కర్నాటకలో 'ఇందిరా క్యాంటీన్‌ల' (Indira canteens) తరహాలో ఇవి ఉంటాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు (స్వయం సహాయక బృందాలు) క్యాంటీన్లు కేటాయించనున్నారు. మహిళా సంఘాల సహకారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 12న పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమక్షంలో మహిళా శక్తి పాలసీ పత్రాన్ని విడుదల చేశారు. బ్యాంకుల ద్వారా లక్ష కోట్ల రుణాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్త్రీ నిధి’ కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్లలో కాంగ్ర...
CM Revanth Reddy | సర్కారు బడులపై  ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం..

CM Revanth Reddy | సర్కారు బడులపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం..

Telangana
CM Revanth Reddy  | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తక్కువగా ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామం, తండాలకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పటిష్టమైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. శిథిలమైన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామ‌న్నారు. విద్యార్థులు రావడం లేదనే సాకుతో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేద‌ని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే అలాంటి దుస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు.ప‌దో త‌ర‌గ‌తిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు వందేమాత‌రం ఫౌండేష‌న్ (vandemataram foundation) ఆధ్వ‌ర్యంలో  రవీంద్రభారతిలో సోమ‌వారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ...
Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..

Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..

Telangana
Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి. సోమ‌వారం ఉత్త‌ర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో రుతు ప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు రుతుప‌వ‌నాలు వ్యాపించాయి.నైరుతి రుతుప‌వనాల వ్యాప్తితో తెలంగాణ‌లో రాగ‌ల‌ మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదురు గాలుల‌తో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంది.హైదరాబాద్ నగరంలో (Hyderabad Rainfall )  జూన్ 13 వరకు వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అదనంగా, తెలం...
IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర

IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర

Telangana
IRCTC New Packeges 2024 | భారతీయ రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు భారీగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుంచి మరో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ రైలు యాత్రను ప్రకటించింది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్టు రైలు జూన్ 22న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. తీర్థ యాత్రలు ఇవే..తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం-, తిరుచ్చి, తంజావూరుహాల్టింగ్ స్టేష‌న్లు.. ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికుల‌కు జ్యోతిర్లింగ (రామేశ్వరం) దర్శనం కోసం ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ , అదే సమయంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కూడా కవర్ చేస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, ...
Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Telangana
Telangana Rains: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 2న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసింది.హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38°C,  26°C నమోదయ్యే అవకాశం ఉంది.రాబోయే 7 రోజులలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు,  ఈదురు గాలులు (30-40 కి.మీ.)తో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.కాగా శనివారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి 45.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. తెలంగాణ స...
New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

Telangana
ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన సోమ్ డిస్టిల‌రీస్ New Beer |  తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కు కిక్కు ఇచ్చేందుకు కొత్త బీర్లు వచ్చేస్తున్నాయి. త్వరలోనే స‌రికొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతినిచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ పేర్ల‌తో కొత్త‌ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందింది. ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి.కాగా, తెలంగాణలో రూ. 5000 కోట్ల మేర‌ లిక్కర్ స్కామ్‌ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉంద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.. కమీషన్ బట్టి ...
Rain forecast | గుడ్‌న్యూస్‌ చెప్పిన వాతావర‌ణ శాఖ‌.. ఈ సారి స‌మృద్ధిగా వ‌ర్షాలు..!

Rain forecast | గుడ్‌న్యూస్‌ చెప్పిన వాతావర‌ణ శాఖ‌.. ఈ సారి స‌మృద్ధిగా వ‌ర్షాలు..!

Telangana
Rain forecast | భార‌త వాతావ‌ర‌ణ శాఖ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనువైన వాతావరణ ప‌రిస్థితులు ఉన్నాయ‌ని భారత వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. మ‌రికొద్దిరోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించి.. ఆ త‌దుప‌రి పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అయితే, గతంలో మే 31నే కేరళను చేరుతాయని అంచనా వేసింది. కేరళలో రుతు పవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాలు ఉత్తరం వైపు కదులుతూ.. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ్‌ మొహపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీ, దక్షిణ హరియాణా, నైరుతి యూపీ, పంజాబ్‌లో ఐదు నుంచి ఏడు రోజులు భారీగా ఉష్ణోగ్ర‌త‌లు నమోద‌య్యాయని, గరిష్ఠంగా 44-48 డిగ్రీలుగా ఉన్న‌ట్లు తెలిపారు. అసోంలో మే 25-26 తేదీల్లో రికార్...
Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..

Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..

Telangana
Crop Loans | మెజారిటీ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy, ) రైతులకు ₹ 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తానని హామీలు గుప్పించారు. దాదాపు ప్రతి ఎన్నికల ర్యాలీలో దేవుని పేరు మీద ఆయన ప్రమాణాలు కూడా చేశారు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఆయన ముందున్న కఠినమైన వాస్తవం ఏమిటంటే, రైతులను అప్పుల కాడి నుండి విముక్తి చేయడానికి సీఎంకు ₹ 33,000 కోట్ల మేర నిధులు అవసరం ఉంది.కనీస మద్దతు ధర కంటే బోనస్‌గా క్వింటాల్ వరికి రూ.500 చెల్లించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్రం ఇప్పటికే సబ్సిడీతో కూడిన ఎల్‌పిజి సిలిండర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించడం ప్రారంభించింది. ఇది సామాజిక భ...
Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు

Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు

Telangana
నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం Power Outage in telangana | గత రెండు రోజుల్లో సూపర్ స్పెషాలిటీతో సహా రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం, మే 22, రాత్రి, భువనగిరి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో వైద్యులు రోగుల‌కు చికిత్స అందించేందుకు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించడం కనిపించింది. అలాగే మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.IV ఫ్లూయిడ్స్‌పై ఉంచాల్సిన రోగులు ఇబ్బందులుప‌డ్డారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ఐదు గంటలపాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో బెడ్‌లు సిద్ధం కాకపోవడంతో, వారు IV ఫ్లూయిడ్ బాటిళ్లను పట్టుకుని బయట వార్డుల్లో కనిపించారు.వేసవి ఉక్క‌పోత‌ను భ‌రించ‌లేక చాలా మంది రోగులు వార్డుల నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. రాత్రి 9.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్‌ఎస్ నేత‌లు నిప్పులు చెరిగా...
Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..

Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..

Telangana
TS Cabinet Meet | హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ స‌మావేశంలో సుమారు 4 గంటలపాటు పలు ముఖ్య‌మైన‌ అంశాలపై మంత్రులు చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ సోనియా గాంధీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లపై రూ.500 బోనస్ (Rs 500 Bonus ) చెల్లించాల‌ని, అలాగే ధాన్యం కొనుగోళ్లను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని, కొనుగోలు ప్రక్రియ సుల‌భ‌త‌రంగా జ‌రిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త‌డిసిన ధాన్యం కొనుగోలు కేబినెట్ స‌మావేశం అనంత‌రం పూర్తి వివ‌రాల‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియా...