TSRTC Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విజయవాడకు ప్రతీ 10 నిమిషాలకు ఒక TSRTC బస్సు,
Hyderabad to Vijayawada Buses : వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ(TSRTC) బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్రయాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక బస్సును నడిపించనున్నట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయని సజ్జనార్ వెల్లడించారు.
10 శాతం డిస్కౌంట్
Hyderabad to Vijayawada Buses బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. తిరుగు ప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని వివరించారు. టీఎస్ఆ ర్టీసీ బస్సుల్లో అడ్...