Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భారత్ అలర్ట్.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..
Mpox Outbreak | ప్రపంచవ్యాప్తంగా MPOX కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, భారత్ అలర్ట్ అయింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి సమీక్షిస్తోంది. . భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ నమోదైనట్లు నివేదించలేదు. అయితే వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఇదిలావుండగా MPOX వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని అత్యవసరంగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపునిచ్చింది.
భారత్ లో వైరస్ వ్యాప్తి తక్కువే..
శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో, రాబోయే వారాల్లో కేసులు నమోదయ్యే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని ప్రస్తుతం భారతదేశంలో మహమ్మారి భారీ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. డబ్ల్యూహ...