Secunderabad-Pune Vande Bharat | సికింద్రాబాద్ కు వందేభారత్ స్లీపర్ రైలు
Secunderabad-Pune Vande Bharat | వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయవంతంమైన తర్వాత.. ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను తీసురావాలని భారతీయ రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని భావిస్తుండగా సరికొత్త స్లీపర్ వెర్షన్ ను సికింద్రాబాద్ - పూణే (Secunderabad-Pune Vande Bharat) మధ్య ప్రవేశపెట్టే అవకాశం ఉంది.వందే భారత్ స్లీపర్ రైళ్లు సుదూర ప్రయాణాలను అనుగుణంగా రాత్రివేళ ప్రయాణించేవారి కోసం తీసుకొస్తున్నారు. ఈ కొత్త రైళ్లు ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నాయి. వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశంలోని స్లీపర్ క్లాస్ రైళ్ల భవిష్యత్తుగా భావిస్తున్నారు. ఇవి అధునాతన భద్రతా వ్యవస్థలు, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్...