Saturday, August 30Thank you for visiting

Tag: Telugu news

మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల  గొంతుకోసి చంపిన అత్త

మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త

National
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తనను నిద్రపోనీయకుండా ఏకధాటిగా ఏడుస్తోందని విసుగు చెంది.. తన రెండేళ్ల మేనకోడలిని కొట్టింది. అంతటితో ఆగకుండా పసిపాప గొంతుకోసి చంపింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్ పూర్ నగరంలోని హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు. బాధితుడు మహ్మద్ షకీల్ కుమార్తె మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిందని హనుమంతల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎం ద్వివేది తెలిపారు. కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా తప్పిపోయిన బాలిక గురించి ఎలాంటి క్లూ లభించలేదని ద్వివేది తెలిపారు.తరువాత, పోలీసులు ఆమె తండ్రి ఇంటిలో పసిబిడ్డ కోసం వెతకడం ప్రారంభించ...
బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

Local
warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు జరగయి.. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి (Bala Tripura Sundari Devi) గా దర్శనమిచ్చారు.అర్చకులు కళ్యాణ్ మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛరణలతో హోమ, కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.సాయంత్రం చిన్నారి విశ్వాని పొడిశెట్టి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులందరు.. అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.. వరంగల్ కీర్తినగర్ లోని శ్రీ నిమిషాంబ దేవీ ఆలయంలో కనుల పండువగా శరన్నవరాత్రి వేడుకలు.. బాలత్రిపుర సుందరి దేవీ అలంకరణ...
TSRTC Electric Buses: త్వరలో అన్ని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు : ఆర్టీసీ ఎండీ ఎండీ సజ్జనార్

TSRTC Electric Buses: త్వరలో అన్ని మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులు : ఆర్టీసీ ఎండీ ఎండీ సజ్జనార్

Telangana
TSRTC Electric Buses: తెలంగాణ వ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా,  త్వరలో మిగతా రూట్లలో కూడా ప్రవేశపెట్టనున్నారు.TSRTC Electric Buses : తెలంగాణలో అతి త్వరలో ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. డిసెంబర్ లో ఈ బస్సులు రోడ్లు ఎక్కనున్నాయి. ఇప్పటికే 1,860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన సంస్థ.. వాటిలో కొన్నింటిని డిసెంబర్ లో వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళిక చేస్తోంది.హరియాణా పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణం తీరును టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్వయంగా పరిశీలి...
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

Trending News
చండీగఢ్‌: పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌ వాహనంతోనే పరారయ్యాడు (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఒక చోట పోలీస్‌ వాహనం కనిపించింది. కానీ లాక్‌ చేసి ఉండటంతో కీ కోసం ఆ ప్రాంతంలో మళ్ళీ వెతికారు. హర్యానాలోని యమునా నగర్‌ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఖుర్ది గ్రామంలో ఒక కుటుంబ కలహాలకు సంభందించిన వివాదంపై పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ ( ERV )లో పోలీసులు(Haryana Police) ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు ఘర్షణ పడటం వీరి కంట పడింది.. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలోనికి ఎక్కించారు.కాగా, పోలీసులు అనంతరం ఆ గ్రామానికి వెళ్లారు.. ఫోన్‌ చేసిన ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా తీయడంలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఇంతలో పోలీసు వాహనంలో ఉన్న...
బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు

బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు

National
Bihar: బీహార్ లో కొందరు పోలీసులు అమానవీయ చర్యకు పాల్పడ్డారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్నిబీహార్ పోలీసులు (Bihar police) కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వీడియోలో సోషల్ మీడియాను షేక్ చేసింది. వ్యక్తి మృతదేహాన్ని ముగ్గురు పోలీసులు లాగడం.. తరువాత కాలువలో పడవేయడం ఈ వీడియోలో ఉంది. దీనిని చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.ముజఫర్‌పూర్‌ (Muzaffarpur)లోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో, ఇద్దరు పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని లాగడం చూడవచ్చు, ఆపై మృతదేహాన్ని కాలువలోకి విసిరేందుకు వారికి సహాయపడటానికి మూడో పోలీసు చేరాడు. ఈ ఘటనపై ఫకులీ ఓపీ ఇన్‌ఛార్జ్‌ మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రమాదంలో ట్రక్కు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితురాలి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. వాటిని పోస్టుమార్టం కోసం వెలికి త...
Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

Crime, National
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు.ఉదయం సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారుల సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దే శవ్యాప్తంగా సంచలనంగా రేపింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల నిఘాలో తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీ సర్కారు 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు. కానీ ఆ తర్వాత రద్దు చేశారు.Delhi Liquor Policy Case లో ఏ...
తెలంగాణపై వరాల వర్షం కురిపించిన ప్రధాని మోదీ..పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!

తెలంగాణపై వరాల వర్షం కురిపించిన ప్రధాని మోదీ..పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!

Telangana
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) పర్యటిస్తున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ ‘ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వరాల వర్షం కురిపించారు.మహబూబ్‌నగర్: తెలంగాణలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ హామీల వర్షం కురిపించారు. బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేశాం.. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముందే శక్తి పూజలు ప్రారంభించాము. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు త్వరలోనే మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్‌ పార్కులు, 4 ఫిషింగ్‌ క్టస్టర్లు నిర్మిస్తాం. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం, రూ.900 కోట్లతో సమక్క, సారక్క గిరిజన యూనివర్స...
215 మంది అధికారులను జైలుకు పంపండి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..

215 మంది అధికారులను జైలుకు పంపండి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..

Trending News
తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో జరిగిన నాటి ప్రభుత్వ అధికారుల దురాగతానికి సంభందించిన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది  అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులందరూ  దోషులుగా మద్రాస్ హైకోర్టు నిర్ధారించింది. ఈమేరకు శుక్రవారం అన్ని అప్పీళ్లను కొట్టివేసి గతంలో సెషన్స్ కోర్టు  ఇచ్చిన తీర్పును సమర్థించింది."బాధితులు, ప్రాసిక్యూషన్ సాక్షులందరి సాక్ష్యాలు సమర్ధవంతంగా, స్థిరంగా ఉన్నాయని ఈ కోర్టు కనుగొంది, అవి నమ్మదగినవి" అని ప్రాసిక్యూషన్ తన సాక్ష్యం ద్వారా తన కేసును రుజువు చేసిందని జస్టిస్ పి వెల్మురుగన్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు.జూన్ 20, 1992న, అధికారులు స్మగ్లింగ్ గంధపు చెక్కల కోసం   వాచాతి గ్రామం పై దాడి చేశారు. ఈ దాడిలో, ఆస్తి, పశువుల విధ్వంసం చేయడమే కాకుం...
ఓ వ్యక్తికి రెండేళ్లుగా కడుపునొప్పి, ఎక్స్ రే చూసి బిత్తరపోయిన డాక్టర్లు.. కడుపులో నుంచి ఏకంగా వంద వస్తువులు

ఓ వ్యక్తికి రెండేళ్లుగా కడుపునొప్పి, ఎక్స్ రే చూసి బిత్తరపోయిన డాక్టర్లు.. కడుపులో నుంచి ఏకంగా వంద వస్తువులు

Trending News
పంజాబ్ లో ఓ ఊహించని ఘటన జరిగింది. పంజాబ్‌లోని మోగాలోని ఓ ఆసుపత్రి వైద్యులు గురువారం ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా కడుపులో నుంచి వచ్చిన వస్తువులను చూసి షాక్ కు గురయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ, రాఖీలను బయటకు తీశారు. . 40 ఏళ్ల వ్యక్తి రెండు రోజులుగా వికారం, వాంతులు, తీవ్ర జ్వరం కడుపు నొప్పి(Stomach Pain)తో బాధపడుతూ.. మోగాలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరాడు. అతని కడుపు నొప్పి తగ్గకపోవడంతో, అతని నొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులు అతని కడుపుపై ​​ఎక్స్-రే స్కాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్స్ రే రిపోర్ట్ చూసిన వైద్యులు బిత్తరపోయారు. స్కాన్‌లో మనిషి కడుపులో అనేక లోహ వస్తువులు ఉన్నట్లు తేలింది. మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన శస్త్ర చికిత్స అనంతరం అతడి శరీరంలోని నుంచి సుమారు 100కు పైగా వస్తువులను వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు.అతని కడుపులోంచి బయటకు తీసిన దాదాపు వ...
ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..

ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..

Crime
ujjain incident : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై రక్తమోడతూ అర్ధనగ్నంగా వీధుల్లో సాయంకోసం అర్థిస్తూ కనిపించిన హృదయవిదారక ఘటన అందరినీ కలిచివేసింది. అయితే అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఆటో డ్రైవర్‌ను మధ్యప్రదేశ్ పోటీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు . అరెస్టయిన ఆటో డ్రైవర్ రాకేష్ (38)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా లభించిందని తెలిపారు. అనంతరం ఆటోపై రక్తపు మరకలు ఉండడంతో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడ...