Friday, August 1Thank you for visiting

Tag: telangana news

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

Telangana
ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన సోమ్ డిస్టిల‌రీస్ New Beer |  తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కు కిక్కు ఇచ్చేందుకు కొత్త బీర్లు వచ్చేస్తున్నాయి. త్వరలోనే స‌రికొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతినిచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ పేర్ల‌తో కొత్త‌ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందింది. ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి.కాగా, తెలంగాణలో రూ. 5000 కోట్ల మేర‌ లిక్కర్ స్కామ్‌ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉంద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.. కమీషన్ బట్టి ...
Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..

Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..

Telangana
Crop Loans | మెజారిటీ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy, ) రైతులకు ₹ 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తానని హామీలు గుప్పించారు. దాదాపు ప్రతి ఎన్నికల ర్యాలీలో దేవుని పేరు మీద ఆయన ప్రమాణాలు కూడా చేశారు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఆయన ముందున్న కఠినమైన వాస్తవం ఏమిటంటే, రైతులను అప్పుల కాడి నుండి విముక్తి చేయడానికి సీఎంకు ₹ 33,000 కోట్ల మేర నిధులు అవసరం ఉంది.కనీస మద్దతు ధర కంటే బోనస్‌గా క్వింటాల్ వరికి రూ.500 చెల్లించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్రం ఇప్పటికే సబ్సిడీతో కూడిన ఎల్‌పిజి సిలిండర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించడం ప్రారంభించింది. ఇది సామాజిక భ...
Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Elections
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్ర‌చారం చేయ‌కుండా ఈసీ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల ప్రెస్ మీట్ లో త‌మ పార్టీపై అభ్యంతరకర ప్రకటనలు చేసిందంటూ టీపీసీసీ కేసీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశార‌ని ఈసీ పేర్కొంది.EC Bans KCR Election Campaign : కాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిపై 48 గంటల నిషేధం బుధవారం రాత్రి 8 గంటలకు అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఏప్రిల్ 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు సిరిసిల్లలో తన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ పా...
TSRTC Buses : ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. విజ‌య‌వాడ‌కు ప్రతీ 10 నిమిషాల‌కు ఒక TSRTC బస్సు,

TSRTC Buses : ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. విజ‌య‌వాడ‌కు ప్రతీ 10 నిమిషాల‌కు ఒక TSRTC బస్సు,

Andhrapradesh, Telangana
Hyderabad to Vijayawada Buses : వేస‌వి సెల‌వుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ ఆర్టీసీ(TSRTC) బ‌స్సు స‌ర్వీసుల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్ర‌యాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక‌ బస్సును న‌డిపించ‌నున్న‌ట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక‌ ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయ‌ని స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. 10 శాతం డిస్కౌంట్ Hyderabad to Vijayawada Buses బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నామ‌ని సజ్జనార్ తెలిపారు. తిరుగు ప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని వివ‌రించారు. టీఎస్ఆ ర్టీసీ బస్సుల్లో అడ్...
Telangana Results : రేపే ఇంటర్ తరగతి పరీక్ష ఫలితాలు..

Telangana Results : రేపే ఇంటర్ తరగతి పరీక్ష ఫలితాలు..

Telangana
Telangana Results : తెలంగాణలో ఎస్సెస్సీ పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ఈనెల 30న (మంగళవారం) విడుదల చేయనుంది ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే.. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా,  2,50,433 మంది బాలికలు ఉన్నారు. జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 20 వరక నిర్వహించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో వ్యాల్యూయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వేగంగా మూల్యాంకన  ప్రక్రియను పూర్తి చేశారు.  గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభం కాగా అదే క్రమంలో  ఫలితాలు కూడా ముందుగానే వ...
Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..

Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..

National
Delhi Excise Policy Case Updates : దిల్లీ లిక్కర్ కేసులో (Delhi Excise Policy Case) వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీలో క‌విత‌ ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర‌చాల‌ని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది కానీ కోర్టు కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏప్రిల్ 15 వరకు కవితను సీబీఐ విచారించనున్న‌ది. మరో వైపు.. కవితకు దిల్లీ కోర్టులో వరుసగా షాక్ లు త‌గులుతున్నాయి. కవిత స‌మ‌ర్పించిన రెండు పిటిషన్లను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు, సీబీఐ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు ...
Weather Update | తెలంగాణకు చ‌ల్ల‌ని క‌బురు.. రెండు రోజులు వానలు

Weather Update | తెలంగాణకు చ‌ల్ల‌ని క‌బురు.. రెండు రోజులు వానలు

Telangana
 Weather Update | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ చల్ల‌ని క‌బురు చెప్పింది. త్వరలో వర్షాలు ప‌డ‌నున్నాయ‌ని తెలిపింది. దీంతో మండుటెండ‌ల నుంచి కాస్త ఉపశమనం క‌లుగుతుంద‌ని వివ‌రించింది. రాష్ట్రంలో ఈనెల 6 వరకు వాతావర ణం పొడిగానే ఉంటుందని, అయితే ఏప్రిల్‌ 7, 8వ‌ తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో ఈనెల 5, 6వ తేదీల్లో వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8వ‌ తేదీల్లో పలు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జ‌ల్లుల‌ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజాగా అప్ డేట్ ఇచ్చింది. ,రాష్ట్రంలో ఈ వేసవి లో బుధవారం మొద‌టిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో బుధ‌వారం 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత న‌మోదైంద...
Ayodhya Direct Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్

Ayodhya Direct Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్

Telangana
Ayodhya Flight: అయోధ్యకు వెళ్లే భక్తులకు శుభ‌వార్త. హైదరాబాద్ నుంచి రామ‌జ‌న్మ‌భూమి అయోధ్య‌కు వెళ్లేందుకు ఇప్ప‌టికే రైలు స‌ర్వీసులు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి.అయితే త్వ‌ర‌లో నేరుగా ఫ్లైట్ లో వెళ్లేందుకు విమాన సర్వీసు కూడా అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.Hyderabad To Ayodhya Direct Flight: అయోధ్య రామయ్య భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి నుంచి ప్రత్యేక విమాన సర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైద‌రాబాద్‌ నుంచి అయోధ్యకు (Ayodhya) డైరెక్ట్ విమాన సేవలను ప్ర‌వేశ‌పెట్టనున్నామ‌ని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ‌ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆదివారం వెల్ల‌డించారు. అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభించాలని.. కేంద్ర ప...
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎవరు?  రూ.5 లక్షలు.. ఎలా మంజూరు చేస్తారు.. ?

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎవరు? రూ.5 లక్షలు.. ఎలా మంజూరు చేస్తారు.. ?

Telangana
Indiramma Housing Scheme | నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే 'ఇందిరమ్మ ఇళ్ల' పథకానికి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. గతంలో ప్రజాపాలన (Praja Palana) లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేయనున్నారు.ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ దశల వారీగా ఈ పథకం వర్తింపజేయనున్నారు. స్థలం ఉండి ఇల్లు లేనవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే స్థలం కూడా లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి వివిధ రకాల ఇంటి మోడల్ డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది. ఈ మోడల్ లో తప్పనిసరిగా ఒక వంట గది, టాయిలెట్‌ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ మోడల్ ను తీర్చిదిద్దారు. మొదటి విడతలతో అన్ని 90 వేలకు పైగా లబ్ధిదారులను గుర్తించ...
Maha Shivaratri : భక్తులకు శుభవార్త.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..

Maha Shivaratri : భక్తులకు శుభవార్త.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..

Telangana
Maha Shivaratri : శివరాత్రి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించేవదుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం (vemulawada temple) లో మహా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. వేములవాడకు భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో టీఎస్ ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడపనుంది.వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల కోసం 1000 ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్​ఆర్టీసీ అధికారులు వెల్లించారు. మార్చి 7న.. 265 బస్సులు, 8న 400, 9వ తేదీన 329 ప్రత్యేక బస్సులను నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు వరం...