Bharachalam railway line | తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్ కు గ్రీన్ సిగ్నల్..
భద్రాచలం నుంచి మల్కన్‌గిరి వరకు ₹4,109 కోట్లతో కొత్త లైన్
Bharachalam railway line | ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ లో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న ప్రధాని మోదీ నిర్ణయించారని తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర సహా పశ్చిమ బెంగాల్‌లోని 7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని వివరించారు. .
24,657 కోట్ల అంచనా..
రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్...