Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు (Warangal Railway Station) శరవేగంగా కొససాగుతున్నాయి. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.25.41 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే (Indina Railways) స్టేషన్ ముఖ ద్వారం సుందరీకరించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.ఇప్పటికే ఓరుగల్లు రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని కాకతీయుల కళావైభవం, వారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చదిద్దారు.. సాయంత్రం వేళ విభిన్న రకాల రంగురంగు లైట్లతో స్టేషన్ వెలిగిపోతూ ప్రయాణికులను, బాటసారులను ఆకర్షిస్తోంది.ఇక రైల్వే స్టేషన్ లోపల ప్రయాణీకులు సులభంగా రాకపోకలు సాగించేందుకు, రద్దీని తగ్గించడానికి 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మిస్తున్నారు. అధునాతన రెస్ట్ రూమ్ లు ర...