Friday, April 18Welcome to Vandebhaarath

Tag: Rain forecast

Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వ‌ర్షాలు !
Andhrapradesh, Telangana

Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వ‌ర్షాలు !

Hyderabad Rain Alert | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. .మరో ఆవర్తనం అండమాన్‌ సముద్రంలో సముద్ర మట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనంగా బలపడే చాన్స్ ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయు గుండంగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది.ఇక ఆదివారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. , సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లా...
Rain forecast | మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Telangana

Rain forecast | మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain forecast | హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల వ‌ల్ల‌ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని, , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.జ‌య‌శంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని, ఈ మేరకు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వ‌ర్షం కురుస్తున్న‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని చెప్పారు.Rain forecast in Hyderabad : ఇక హైద‌రాబాద్ లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. స...
Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం
Telangana

Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

Rainfall | హైదరాబాద్: తెలంగాణ లో జూలై 12 నుంచి 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప‌లుజిల్లాల్లో స‌రైన వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో క‌రువు ప‌రిస్థితులు వ‌స్త‌యేమోన‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.ఈ క్ర‌మంలోనే వాతావ‌ర‌ణ కేంద్రం వ‌ర్షాల‌కు సంబంధించి కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని తెలిపింది. ఈమేర‌కు భారత వాతావరణ శాఖ (IMD) అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది, ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ అండ్ సొసైటీ డేటా ప్రకారం, రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హైద‌రాబాద్ ప‌రిధిలో 174.6 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక్క‌డ‌ సాధారణ పరిధి 154 ...
Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..
Telangana

Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..

Telangana Heavy Rains | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ‌నున్నాయ‌నిపేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ప‌లుచోట్ల వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చ‌రించింది.ఇక‌ సోమవారం మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగామ‌ జిల్లాలో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తాయని...
TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ
Telangana

TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ

TG Weather Report | తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది ఐఎండి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్‌ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.ఇక నిజామాబాద్‌, కామారెడ్డి , కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌యశంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, మహబూబాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, జిల్లాలో బుధవారం నుంచి గురువార...
Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..
Andhrapradesh

Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. జూన్ 15, 2024 శనివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.Weather Updates రానున్న ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలు బీహార్...
Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Telangana

Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Telangana Rains: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 2న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసింది.హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38°C,  26°C నమోదయ్యే అవకాశం ఉంది.రాబోయే 7 రోజులలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు,  ఈదురు గాలులు (30-40 కి.మీ.)తో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.కాగా శనివారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి 45.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. తెలంగాణ స...
Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
Telangana

Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు

లోక్‌సభ ఎన్నికల వేళ.. వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌..! Telangana Rains  | లోక్ సభ ఎన్నికల వేళ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad ) ఆదివారం తెలిపింది. రాష్ట్రంలో పార్లమెంట్‌ నాలుగో విడుత ఎన్నికలు (Loksabha Elections 2024) జరుగనున్నాయి. అలాగే కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే..కాగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగ...
Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌
National

Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌

Heatwave Alert | దేశంలోని తూర్పు, దక్షిణ భార‌త‌దేశంలో కొనసాగుతున్న హీట్‌వేవ్ మే 5-6 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. మేలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. ఉత్తర , మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వ‌డ‌గాల్పులు వీచే చాన్స్ ఉంద‌ని ఐఎండీ తెలిపింది. IMD తాజా వాతావరణ సూచన ప్రకారం, హీట్‌వేవ్ పరిస్థితులు తూర్పు భారతదేశంలో మే 5 వరకు దక్షిణ భారతదేశంలో మే 6 వరకు కొనసాగుతాయని , ఆ తర్వాత అవి తగ్గుతాయని వెల్ల‌డించింది. అయితే మే 5, 6 తేదీలలో ఈశాన్య భారతదేశంలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ‌డ‌గాల్పులు Heatwave Alert తూర్పు దక్షిణ ద‌క్షిణ‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న...
Telangana Rain Alert :  తెలంగాణలో నాలుగు రోజులపాటు వ‌ర్షాలే.. వ‌ర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!
Telangana

Telangana Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులపాటు వ‌ర్షాలే.. వ‌ర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

Telangana Rain Alert | తెలంగాణలో రానున్న‌ నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చ‌రించింది. సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, వరంగల్‌, హనుమ‌కొండ, జనగామ‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.సోమవారం నుంచి మంగళవారం వరకు ఉమ్మ‌డి కరీంనగర్‌, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో వ‌ర్షాలు వానలు కురిసే చాన్స్‌ ఉందని తెలిపింది. ఇక‌ మంగళవ...