
మనదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు, విశేషాలు
Top Sri Krishna Temples in India : శ్రీకృష్ణుడు ప్రపంచంలోని గొప్ప తత్వవేత్త.. విష్ణువుని ఎనిమిదో అవతార పురుషుడు. ప్రపంచమంతా ఆయనను భక్తి ఆరాధనతో పూజిస్తుంది. శ్రీకృష్ణాష్టమి వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కృష్ణ దేవాలయాలు ఆధ్యాత్మిక పరిమళలాలను ఇనుమడింపజేస్తున్నాయి. భారతదేశం అద్భుతమైన శిల్పకళా వైభవంతో అనేక అందమైన కృష్ణ దేవాలయాలకు నిలయం. శ్రీకృష్ణుని ఆలయాల గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.
ఇస్కాన్ టెంపుల్, బృందావన్, ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర నగరమైన బృందావన్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON ) ఇస్కాన్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత అందమైన కృష్ణ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, రాధ కొలువుదీరి నిత్యం పూజలందుకుంటారు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలతో పాటు ప...