
Nipah Virus : కేరళలో 5 నిపా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 700 మంది, 77 మంది హై-రిస్క్
కేరళ (kerala) లో నిఫా వైరస్ భయాందోళన సృష్టిస్తోంది. నిపా సోకిన పేషెంట్‌తో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త బుధవారం పాజిటివ్ తేలడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌ల ( Containment zones )ను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించింది. నిఫా రోగులతో కాంటాక్ట్ అయిన వారి సంఖ్య 700గా ఉండడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ 700 మందిలో 77 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కేరళలో Nipah Virus అప్‌డేట్‌లు
1. హై రిస్క్ ఉన్న నిపా రోగులు తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు.
2. కోజికోడ్‌లో పండుగలు, ఫంక్షన్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధించారు.
3. కోజికోడ్ జిల్లా (Kozhikode district) లోని వడకర తాలూకాలోని తొమ్మిది పంచాయతీల్లోని 58 వార్డులను కంటైన్‌మెంట్ జో...