
భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం
వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి
ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18 మంది చనిపోగా పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మరణించారు.ఢిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. గత ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు
మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుపోయినవారిని రక్షించేందుకు మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను నాలుగు ఉత్తర భారత రాష్ట్రాల్లో మోహరించారు. పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో
ఎనిమిది, హర్యానాలో ఐదు బృందా...