
Top 10 Tractors | ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన టాప్ 10 ట్రాక్టర్ కంపెనీలు ఇవే..
Top 10 Tractors : రైతులకు ట్రాక్టర్లు అత్యంత విలువైనవి. ఈ శతాబ్దంలో ట్రాక్టర్ లేకుండా వ్యవసాయాన్ని ఊహించలేం. ట్రాక్టర్ అనేది పొలాల్లో ఎన్నో రకాల పనులని సమర్థవంతంగా నిర్వర్తించే యంత్రం. ప్రపంచవ్యాప్తంగా ట్రాక్టర్లు ప్రతి రైతు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ట్రాక్టర్ బ్రాండ్‌లు నిరంతరం నాణ్యతతో కూడిన ట్రాక్టర్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రోజుల్లో భారతీయ ట్రాక్టర్ కంపెనీలు విదేశీ ట్రాక్టర్ కంపెనీకి పోటీగా నిలుస్తున్నాయి.ఈ కథనంలో ప్రపంచంలోని టాప్ 10 ప్రముఖ ట్రాక్టర్ కంపెనీలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు.
1. మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra)మహీంద్రా ట్రాక్టర్ బ్రాండ్ ప్రపంచంలోనే నంబర్ 1 ట్రాక్టర్ బ్రాండ్. ఇది రైతుల కోసం నాణ్యమైన ఫీచర్ ట్రాక్టర్‌లను ఉత్పత్తి చేసే భారతదేశ తయారీదారు. మహీంద్రా ఎల్లప్పుడూ రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తుంది. వారు ప్రపంచ...