Thursday, December 19Thank you for visiting
Shadow

Tag: kcr

KCR | ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్ ..

KCR | ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్ ..

Telangana
KCR | కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొత్త‌గా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయ‌డంపై మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల‌చంద్ర‌శేఖ‌ర్ రావు ఫైర్ అయ్యారు. ఇది ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు ఇవేనా అని ప్ర‌శ్నించారు. ఇది కాంగ్రెస్ మూర్ఖ‌త్వ‌మ‌ని కేసీఆర్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేప‌టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న‌ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ (KCR) తీవ్ర అభ్యంత్రం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అంటూ ప్ర‌శ్నించారు. ప్రభుత్వం ముందుగా ప్ర‌జ‌ల‌ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల...
Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Elections
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్ర‌చారం చేయ‌కుండా ఈసీ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల ప్రెస్ మీట్ లో త‌మ పార్టీపై అభ్యంతరకర ప్రకటనలు చేసిందంటూ టీపీసీసీ కేసీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశార‌ని ఈసీ పేర్కొంది.EC Bans KCR Election Campaign : కాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిపై 48 గంటల నిషేధం బుధవారం రాత్రి 8 గంటలకు అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఏప్రిల్ 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు సిరిసిల్లలో తన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ పా...
Delhi Liquor Scam Case : లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు  తరలింపు

Delhi Liquor Scam Case : లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు తరలింపు

National
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ మంగళవారం ముగిసింది.  ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచాల్సి ఉండగా  కాస్త ఆలస్యంగా 11:45 గంటలకు హాజరుపరిచారు. కాగా మరోసారి కస్టడీ ఈడీ.. కోరగా,   కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.  ఇరువైపులా వాదనలు విన్న కోర్టు..  ఎమ్మెల్సీ కవితకు   రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ ( Judicial Remand) విధించడంతో ఆమెను తీహార్ జైలు(Tihar Jail )కు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే..కాగా  కోర్టులో హాజరుపరిచేముందుక కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.  తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ కేసు కాదని, రాజక...
MLC Elections : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్.. మిగతా ఎవరికి చాన్స్..?

MLC Elections : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్.. మిగతా ఎవరికి చాన్స్..?

Telangana
MLC Elections 2024 : ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎం కోదండరామ్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయంపై   కాంగ్రెస్ హైకమాండ్ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇద్దరు గవర్నర్‌ కోటా కింద, మరో ఇద్దరు ఎమ్మెల్యేల కోటా కింద నామినేట్‌ చేయనుండగా  జనవరి 29న పోలింగ్‌ జరగనుంది.తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గత గురువారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు వారి పదవులకు రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఎలాంటి పోటీ లేకుండా రెండు స్థానాలను సునాయాసంగా ...
తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు..  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

Telangana
Telangana Assembly Sessions: తెలంగాణలో ఆర్థికి స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, వేర్వేరు మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. Telangana Assembly Sessions అసెంబ్లీలో 42పేజీల శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని సభ్యులందరికీ అందజేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. 2014-15 నాటికి ఈ అప్పు 72 వేల 658 కోట్లు ఉండేదని, ఈ పదేళ్ల కాలంలో ఆ అప్పు 24.05 శాతం పెరిగిందని వివరించింది. 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. రాష్ట్ర అప్పు రూ.3 లక్షల 89వేల 673 కోట్...
KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

Telangana
KCR resigns to Telangana CM Post: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఓఎస్డీ తో తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపించారు.ఎగ్జిట్‌ పోల్స్‌లో ఊహించిన విధంగానే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బీఆర్‌ఎస్‌ కు గట్టి షాక్ తగిలింది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు తదితరులు బీఆర్‌ఎస్‌ పరాజయాన్నిఅంగీకరించారు. రెండు సార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఫ‌లితాలను ఒక పాఠంగా భావిస్తామని, మరలా పుంజుకొంటామని కేటీఆర్‌, హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్య...
కేసీఆర్ నుంచి జానా రెడ్డి వరకు.. అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు వీరే…

కేసీఆర్ నుంచి జానా రెడ్డి వరకు.. అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు వీరే…

Telangana
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఈ ఎన్నికల్లో తలలు పండిన రాజకీయవేత్తలతోపాటు యువ నాయకులు బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు ఎవరో ఒక సారి తెలుసుకుందాం.రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన నేతలు 45 మందికి పైగా ఉన్నారు.ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు (1985, 1989, 1994, 1999, 2001 బై పోల్, 2004, 2014, 2018).కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి (Jana Reddy) , బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ (Etala rajender) ఇద్దరూ ఏడుసార్లు విజయం సాధించారు.జానా రెడ్డి 1983, 1985లో టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 1989, 1999, 2004, 2009, 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించారు.ఈటల రాజేందర్ (Etela Rajender) 2004, 2008 (By Poll), 2009...
Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..

Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..

National
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party (BJP), ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించవచ్చు.ABP News- CVoter విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, రాజస్థాన్‌లో బీజేపీ కమలం అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. సర్వే(survey ) వివరాలను ఒకసారి చూడండి.. తెలంగాణ: ఒపీనియన్ పోల్ (opinion polls) ఆధారంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 119 సీట్ల అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేయగా, కాంగ్రెస్‌(congress)క...
ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి

ప్రభుత్వ సమాచారం ఇక నేరుగా మీ వాట్సాప్‍కే.. ఇలా ఫాలో అవ్వండి

Telangana
Telangana CMO WhatsApp channel :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకునే పనిలో పడింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) వాట్సాప్ చానెల్ (WhatsApp) ను ప్రారభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సీఎంవో నుంచి వెలువడే ప్రకటనలను ప్రజలకు చేరవేస్తుంది.ఈ ఛానెల్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలు, ముఖ్య సమాచారాన్ని సాధారణ ప్రజలకు వేగంగా చేరేలా చేస్తుంది. CMO ఛానెల్‌ ద్వారా ప్రజలు CMO నుండి తాజా అప్ డేట్స్ ను చూడవచ్చు.CMO వాట్సాప్ ఛానెల్‌ని IT డిపార్ట్‌మెంట్ లోని డిజిటల్ మీడియా విభాగం, ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం (CMPRO) నిర్వహిస్తుంది.  QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ప్రజలు  ఛానెల్‌లో చేరవచ్చు.CMO ఛానెల్‌లో ఇలా  చేరవచ్చు.1. WhatsApp అప్లికేషన్ తెరవండి.2. మొబైల్‌ ఫోన్ వాట్సప...
Rakhi: తెలంగాణ ప్రజలకురాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

Rakhi: తెలంగాణ ప్రజలకురాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

Local
హైద‌రాబాద్ : తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల‌ నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే ర‌క్షా బంధన్  రాఖి  పౌర్ణమి పండుగ (Rakhi festival ) సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంద‌న్నారు. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు._రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలవాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని సీఎం kcr పేర్కొన్నారు.._మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమ...