Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party (BJP), ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించవచ్చు.
ABP News- CVoter విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, రాజస్థాన్‌లో బీజేపీ కమలం అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. సర్వే(survey ) వివరాలను ఒకసారి చూడండి..
తెలంగాణ:
ఒపీనియన్ పోల్ (opinion polls) ఆధారంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 119 సీట్ల అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేయగా, కాంగ్రెస్(congress)కు 48 నుంచి 60 సీట్లు వస్తాయని అంచనా.. బీజేపీ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఆ పార్టీ 5 నుంచి 11 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది.
ABP-CVoter పోల్ ప్రకారం, కాంగ్రెస్ దాదాపు 39% ఓట్ షేర్‌ను సంపాదించుకోనుంది. ఇది 10.5% గణనీయమైన పెరుగుదల. దీనికి విరుద్ధంగా, అధికార BRS పార్టీ 37% ఓట్ల వాటాను పొందగలదని అంచనా వేసింది. ఇది గతంలో కంటే 9.4% ఓట్ల క్షీణతను సూచిస్తుంది. ఇక BJP 16% ఓట్లను కైవసం చేసుకుంటుందని అంచనా చేసింది. ఇది దాని ఓట్ల వాటాలో 9.3% పెరుగుదలను సూచిస్తుంది.
అంచనా వేసిన సీట్లు:
INC: 48-60
బీజేపీ: 5-11
BRS: 43-55
ఇతరులు: 5-11
ఛత్తీస్‌గఢ్:
ABP-CVoter ఒపీనియన్ పోల్ ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ తో అధికార కాంగ్రెస్ దాని ప్రత్యర్థి అయిన BJP కంటే 1% స్వల్ప ఆధిక్యాన్ని కలిగి ఉంది. సర్వే ప్రకారం, కాంగ్రెస్‌కు 45% ఓట్లు వస్తాయని అంచనా వేయగా, బీజేపీకి 44% ఓట్లు వస్తాయని తెలిపింది. 90 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీల మధ్య కీలకమైన మెజారిటీ 46 సీట్లను చేరుకునేందుకు తీవ్ర పోటీ నెలకొందని సర్వేలో తేలింది.
అంచనా వేసిన సీట్లు:
INC: 45-51
బీజేపీ: 39-45
ఇతరులు: 0-2
మధ్యప్రదేశ్:
ABP-CVoter సర్వే ప్రకారం, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ప్రయోజనం ఉంది. ఇది అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించే అవకాశం ఉంది. అయితే, మధ్యప్రదేశ్‌లో ఐఎన్‌సికి గెలుపు ఓట్లు తక్కువగా ఉండటం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో సర్వేలో విశేషమేమిటంటే, కాంగ్రెస్.. బీజేపీ రెండూ సమానంగా 45% ఓట్లను సాధించగలవని అంచనా వేసింది.
230 సీట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 113 నుంచి 125 సీట్ల మధ్య గెలుస్తుందని అంచనా. సర్వే సూచించినట్లుగా మెజారిటీకి అవసరమైన 116 మార్కును సమర్థవంతంగా దాటుతుంది. మరోవైపు, బీజేపీ కోరుకున్న సంఖ్య కంటే కొన్ని సీట్లు తక్కువగా వస్తాయని తెలిపింది. సర్వే ప్రకారం అది 104 నుంచి 116 సీట్లు వస్తుందని అంచనా వేసింది.
అంచనా వేసిన సీట్లు:
కాంగ్రెస్: 113-125
బీజేపీ: 104-116
ఇతరులు: 0-4
రాజస్థాన్:
ABP-CVoter సర్వే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి భారీ విజయాన్ని అందజేస్తుందని అంచనా వేసింది. 200 అసెంబ్లీ సీట్లలో కాషాయ పార్టీ 127-137 సీట్లు గెలుచుకుంటుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ 59-69 సీట్లు గెలుచుకోవడం ద్వారా అట్టగుడున చేరుతుందని అంచనా.
బిజెపి 2018 ఎన్నికలలో సాధించిన 38% కంటే గణనీయమైన పెరుగుదలతో సుమారుగా 46% ఓట్లను పొందవచ్చని అంచనా. దీనికి భిన్నంగా కాంగ్రెస్‌కు 42% ఓట్లు వస్తాయని అంచనా.
అంచనా వేసిన సీట్లు:
INC: 59-69
బీజేపీ: 127-137
ఇతరులు: 2-6
మిజోరం:
ABP-CVoter ఒపీనియన్ పోల్ ప్రకారం.. మిజోరాంలో ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి మెజారిటీని సాధించలేక హంగ్ వస్తుందని అంచనా వేసింది. 40 సీట్ల అసెంబ్లీలో.. అధికార MNF సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడానికి సిద్ధంగా ఉంది. సర్వే ప్రకారం, కాంగ్రెస్ రన్నరప్‌గా నిలిచింది.
అంచనా వేసిన సీట్లు:
MNF: 13-17
INC: 10-14
ZPM: 9-13
ఇతరులు: 1-3