Tuesday, July 1Welcome to Vandebhaarath

Tag: India

Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి :  గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..
Crime

Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి : గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..

Hathras stampede : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక‌ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకుంది. ఈమేర‌కు అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ పీటీఐకి వెల్ల‌డించారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. కారణాలు ఇవే.. భారతదేశంలో ఆధ్యాత్మిక‌ సమావేశాలు, ఉత్స‌వాలు త‌ర‌చూ జ‌రుగుతుంటాయి. ఇందుకోసం వేలాది మంది భక్తులు హాజ‌రవుతుంటారు. అయితే ఆయా స‌మావేశాల వ‌ద్ద‌ ఎటువంటి క‌నీస‌ సౌకర్యాలు ఉండ‌వు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిపోయేందుకు స‌రైన మార్గాలు ఉండ‌వు. కొన్నిసార్లు, ఈ ఈవెంట్‌ల నిర్వాహకులకు స్థానిక అధికారులతో సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఫ‌లితంగా ఒక్కోసారి ద...
Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?
National, తాజా వార్తలు

Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు.అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొద‌ట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివ‌ర్గంలో మిత్ర‌ప‌క్షాల‌కు కూడా పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుద...
Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!
World

Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!

Pakistan Economic Crisis Explained | మ‌న పొరుగుదేశం దేశం పాకిస్థాన్ (Pakistan) ఆర్థికంగా చితికిపోయి సాయం కోసం అన్ని దేశాల‌ను యాచిస్తోంది. గ‌త ఐదేళ్ల‌లో ఆ దేశ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 2024 మే 17న, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి (Pulwama Attack)లో 40 మంది వీర జవాన్లను కోల్పోయిన తర్వాత భారత్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌ని అంగీకరించారు. ఆర్టికల్ 370 రద్దుపై ఇషాక్ దార్ స్పందిస్తూ.. ఈ నిర్ణ‌యం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్ నుంచి ఎగుమతులపై భారతదేశం 200% సుంకాన్ని విధించిందని, నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్ బస్సు సర్వీస్, వాణిజ్యాన్ని నిలిపివేసిందని అన్నారు.పాక్ తో వాణిజ్యాన్ని తగ్గించడానికి భారతదేశం తక్షణ చర్యలు తీసుకుంది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా మొదటిది.. పాకిస్తాన్ ఇకపై 'అత్యంత అనుకూల దేశాల' లేదా MFN...
పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
Elections, National

పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

Mani Shankar Aiyar | కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యల వివాదం మర్చిపోకముందే అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సైతం వివాద్పద వ్యాఖ్యలు చేశారు.  పాకిస్థాన్‌ ను గౌరవించాలని, ఆ దేశంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని పార్టీ కురువృద్ధుడు మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్‌ (Mani Shankar Aiyar ) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ వ‌ద్ద అణుబాంబులు ఉన్నాయ‌ని, ఒక‌వేళ మ‌న ప్ర‌భుత్వాలు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తే అప్పుడు పాక్ మ‌నపై బాంబులు వేసే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల ఒక‌ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌ణిశంక‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యింది. మ‌నం పాకిస్థాన్‌ను గౌర‌వించాల‌ని, ఎందుకంటే ఆ దేశం వ‌ద్ద అణు బాంబు ఉంద‌ని, వాళ్ల‌ను మ‌నం గౌర‌వించ‌కుంటే వాళ్లు మ‌న‌పై బాంబుల‌ను వాడే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అయ్య‌ర్ వెల్ల‌డిం...
LPG price cut :  గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..
National

LPG price cut : గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..

LPG price cut | భారతదేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) 19 కిలోల వాణిజ్య సిలిండర్‌, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరను ₹ 30.50 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి . ఈరోజు నుంచే కొత్త ధ‌ర‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. స‌వ‌రించిన ధ‌ర‌ల ప్ర‌కారం.. ఏప్రిల్ 1 నాటికి, ఢిల్లీలో ధర ₹ 1,764.50 గా ఉంది. 5 కిలోల FTL సిలిండర్ల ధర ₹ 7.50 తగ్గింది .ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వ్యాణిజ్య సిలిండర్ల ధ‌ర‌లు రెండుసార్లు పెంచిన విష‌యం తెలిసిందే. . దీనికి ముందు, నూతన సంవత్సరం 2024 సందర్భంగా 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్‌పై ₹ 39.50 చొప్పున ధరలు తగ్గించారు.కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్‌ల ధరలు పెరిగినప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 1న గతంలో చేసిన ప్రకటన తర్వాత సిలిండర్ల ధరలలో ఈ మార్పు వచ్చింది. ఆ సమయంలో,...
Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్..  ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?
Trending News

Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?

Underwater Metro Train | పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన భార‌త‌దేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా సుల‌భ‌త‌రం కానుంది.కోల్ క‌తాలోని ఈ అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్ లో ప్రధాని మోదీ తొలిసారి విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్లతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండ‌ర్ వాట‌ర్ మెట్రో లైన్‌ కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్‌ లేక్‌లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా, అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి. ...
గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..
Telangana

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం  వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ  ప్రయాణా...
Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభమైంది.. భారత్​ ఎన్​సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..
National

Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభమైంది.. భారత్​ ఎన్​సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..

Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్​ ఎన్​సీఏపీ (భారత్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​) ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఆగస్టు 22న మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్​.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబరు నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా.. దేశీయంగా కార్​ క్రాష్​ టెస్ట్​ ప్రోగ్రామ్​ కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్​, దక్షిణ కొరియాలో ఈ పరీక్షలు చేస్తున్నారు. వాహన వినియోగదారుల భద్రతే లక్ష్యం దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా మోడళ్ల కార్లు​ రోడ్డుపై తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అడుగుపెడతాయి. అయితే.. భద్రతా పరంగా ఏ వాహనాన్ని ఎంచుకోవాలనే దానిపై సందేహిస్తున్న కస్టమర్లకు.. ఈ భారత్​ ఎన్​సీఏపీ...
రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన
Local

రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

హనుమకొండ : భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హన్మకొండ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. 2022లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపేందుకు గాంధీ చిత్రాన్ని (Gandhi movie) ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఉచితంగా సినిమా ప్రదర్శనను నిర్వహించనున్నారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా చిత్రాన్ని చూసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు14వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, 20వ తేదీ ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండ...
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా ఇది.. వాటి రూట్‌లు, రైలు నంబర్లు షెడ్యూల్‌ వివరాలు తెలుసుకోండి
National

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా ఇది.. వాటి రూట్‌లు, రైలు నంబర్లు షెడ్యూల్‌ వివరాలు తెలుసుకోండి

న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ రైళ్లో ఫుల్లీ ఎయిర్కండిషన్డ్ ఉంటుంది. వందే భారత్ రైలు మొదట జనవరి 17, 2019న ప్రారంభించారు.ఈ రైలు ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఉచిత వైఫై కనెక్టివిటీ, 32-అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, సూపర్ కంఫర్టబుల్ సీట్లు, పరిశుభ్రమైన భోజనం వంటి అనేక సౌకర్యాలు, ఫీచర్లతో ప్రయాణికులకు మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తున్నాయి. ప్రస్తుతానికి, మొత్తం సంఖ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 23కి చేరుకుంది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల లిస్ట్ చూడండి.. 22435/22436 న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..