Friday, April 18Welcome to Vandebhaarath

Tag: IMD report

AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..
Andhrapradesh

AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

AP Floods | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర‌రూపం దాల్చుతోంది. దీని కార‌ణంగా సోమవారం నాటికి ఒడిసా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం (సెప్టెంబర్ 8) రోజున ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు (AP Floods) కురిసే చాన్స్ ఉంద‌ని రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన బులెటిన్‌లో తెలిపింది.సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. తూర్పుగోదావర...
Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్
Telangana

Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్

Telangana Rains Red Alert  | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలంగాణ‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం న‌మోదైంది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప‌లు జిల్లాల్లో మరో రెండురోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్ర‌మాద‌ముంద‌ని పేర్కొంటూ ఈ క్రమంలో రెడ్‌ అలెర్ట్‌ను (Red Alert) జారీ చేసింది. కాగా కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో శ‌నివారం అత్యంత భారీ వర్షాలు కురిశాయి.ఇక ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల అతిభారీ వర్షాలు...
IMD Report | రానున్న‌ ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ ..
Telangana

IMD Report | రానున్న‌ ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ ..

IMD Report  | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ‌ఎల్లో అలెర్ట్‌ల‌ను జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించింద‌ని, వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల పాటు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేర‌నున్న‌ట్లు అంచనా వేసింది. ఈ క్రమంలో తెలంగాణలో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిందిIMD Report  శుక్రవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిజామాబాద్‌, ‌నిర్మల్‌, ‌సిర...
Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
Telangana

Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ సహా పలు జిల్లాల్లో ఆది, సోమ‌వారాల్లో భారీ వర్షం కురిసింది.నగరంలో చాలా భాగం - సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, ఎల్‌బి నగర్, బాలానగర్, ప్ర‌గతి నగర్, నిజాంపేట్, కొండాపూర్, మాదాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి, హైటెక్ కారిడార్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, గోల్కొండ, మణికొండ, టోలిచౌకి, జూబ్లీ హిల్స్‌, షేక్‌పేట్, నానల్ నగర్, బండ్లగూడ, రాజేంద్రనగర్, పాతబస్తీ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, కోటి, అబిడ్స్, బేగంపేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, చందానగర్, మూసాపేట్, కుసాహిగూడ, చీకలగూడ, జీడిమెట్ల, మర్రెడ్‌పల్లి, ఈసీఐఎల్‌లో భారీ వర్షం పడింది. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వ‌ర్షం కురిసింది.హైదరాబాద్...
TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ
Telangana

TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ

TG Weather Report | తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది ఐఎండి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్‌ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.ఇక నిజామాబాద్‌, కామారెడ్డి , కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌యశంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, మహబూబాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, జిల్లాలో బుధవారం నుంచి గురువార...
Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..
Telangana

Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..

Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి. సోమ‌వారం ఉత్త‌ర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో రుతు ప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు రుతుప‌వ‌నాలు వ్యాపించాయి.నైరుతి రుతుప‌వనాల వ్యాప్తితో తెలంగాణ‌లో రాగ‌ల‌ మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదురు గాలుల‌తో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంది.హైదరాబాద్ నగరంలో (Hyderabad Rainfall )  జూన్ 13 వరకు వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అదనంగా, తెలం...
Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌
National

Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌

Heatwave Alert | దేశంలోని తూర్పు, దక్షిణ భార‌త‌దేశంలో కొనసాగుతున్న హీట్‌వేవ్ మే 5-6 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. మేలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. ఉత్తర , మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వ‌డ‌గాల్పులు వీచే చాన్స్ ఉంద‌ని ఐఎండీ తెలిపింది. IMD తాజా వాతావరణ సూచన ప్రకారం, హీట్‌వేవ్ పరిస్థితులు తూర్పు భారతదేశంలో మే 5 వరకు దక్షిణ భారతదేశంలో మే 6 వరకు కొనసాగుతాయని , ఆ తర్వాత అవి తగ్గుతాయని వెల్ల‌డించింది. అయితే మే 5, 6 తేదీలలో ఈశాన్య భారతదేశంలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ‌డ‌గాల్పులు Heatwave Alert తూర్పు దక్షిణ ద‌క్షిణ‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న...
భారీ వర్షాలతో తెలంగాణ విలవిల
Telangana

భారీ వర్షాలతో తెలంగాణ విలవిల

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని సమాచారం.మూడు రోజుల రెడ్ అలర్ట్ తర్వాత, వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో హెచ్చరిక స్థాయిని 'ఆరెంజ్' అలర్ట్  కు తగ్గించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో లక్ష్మీదేవిపేట (ములుగు జిల్లా), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)లో వరుసగా 64.98 సెం.మీ, 61.65 సెం.మీ వర్షపాతం నమోదైంది.నివేదికల ప్రకారం, గురువారం భారీ వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎనిమిది మంది వ్యక్తులు వేర్వేరు సంఘటనలలో మరణించారు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి.యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోగా, హనుమకొండలో లైవ్ వైరు తగిలి ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన ఎం.వెంకటేష్ (23) సబితం జలపాతంలో జారిపడి గల్లంతయ్యాడు. హనుమకొండలోని గోపాలపూర్‌కు చెందిన జి రాజు నీటిలో కొట్టుకుప...
మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు
National

మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు

హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ శాఖ (IMD)  Indian Meteorological Department షాకింగ్ న్యూస్ వెలువరించింది. మరో ఐదు రోజుల పాటు బీహార్, జార్ఖండ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతల్లో హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.జూన్ 11-13 మధ్య దక్షిణ హర్యానా-ఢిల్లీ, దక్షిణ ఉత్తరప్రదేశ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశాలో. అలాగే జూన్ 12న హిమాలయ పశ్చిమ బెంగాల్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో హీట్‌వేవ్ పరిస్థితులు కూడా ఉంటాయని అంచనా. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, నాన్ ఎయిడెడ్ (మైనారిటీతో సహా) రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12 నుంచి జూన్ 14 వరకు మూసివేశారు. బీహార...