Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇకపై ‘తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి కాదా?
Ration Cards | సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా రేషన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనతో రేషన్ కార్డు లేని నిరుపేదలు ఏ పథకాన్ని కూడా పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుల (white ration card)ను కలిగి ఉండాలనే నిబంధనను తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గతంలో, కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు, ఇళ్ల స్థలాలను పొందేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తెల్ల రేషన్ కార్డులను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల తర్వాతే కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.ప్రజా పంపిణీ వ్యవస్థ (ప...